
అయితే, ప్రభుత్వం విత్తలోటును అదుపు చేసేందుకు వ్యయాలను తగ్గించుకుంటుదన్న సంకేతాలు తీవ్రమైన ఆందోళనకు కారణమవుతున్నాయని తెలిపింది. విత్త లోటును నియంత్రించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, భారీ స్థాయిలో వ్యయాలు తగ్గించుకోవడం వల్ల దేశంలో వ్యాపార అవకాశాలు మరింత కుంగిపోయే ప్రమాదం ఉందని అసోచామ్ పేర్కొంది. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థలో శుభసంకేతాలు కనిపిస్తున్నాయనీ, ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా ఈ ఏడాది 8 శాతం వృద్ధి రేటు సాధ్యమవుతుందని ప్రకటించిన నేపథ్యంలో అసోచామ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 24 పారిశ్రామిక రంగాలు ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయని అసోచాం సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్ తెలిపారు. డిమాండ్ మెరుగుపడితేనే పెట్టుబడుల పునరుద్ధరణ జరుగుతుందన్నారు.
మూలధన వస్తువుల రంగంలో స్పష్టమైన వృద్ధి సంకేతాలు కనిపిస్తే గాని, ఉత్పాదక రంగంలోకి కొత్త పెట్టుబడులు రావని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో క్యాపిటల్ గూడ్స్ రంగంలో 0.7 శాతం మేర ప్రతికూల వృద్ధి నమోదు కాగా, ఒక్క సెప్టెంబర్ నెలలోనే 6.8 శాతం ప్రతికూల వృద్ధి నమోదైందని వెల్లడించింది.
మహిళా బ్యాంకును ప్రారంభించిన ప్రధాని
ముంబై/ఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 96వ జయంతి సందర్భంగా మహిళల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారతీయ మహిళా బ్యాంకు మంగళవారం ప్రారంభమైంది. తొలి బ్యాంకు శాఖను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దక్షిణ ముంబై నారిమన్ పాయింట్‌లోని ఎయిరిండియా బిల్డింగ్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి యూపిఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, కేంద్రమంత్రి శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, ఆర్థిక మంత్రి చిదంబరం, మహారాష్ట్ర గవర్నర్ కె. శంకరనారాయణన్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. మహిళా సాధికారత, భద్రత కోసం చేయాల్సింది ఇంకా చాల ఉందని, బ్యాంకు ప్రారంభం అనేది చిన్న అడుగు మాత్రమేనని అన్నారు. మహిళా బ్యాంకును ప్రారంభించి ఇందిరా గాంధీకి ఘన నివాళులర్పించామని, ఇంతకన్నా ఆమెకు ఘన నివాళి లేదని సోనియా గాంధీ పేర్కొన్నారు.
వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలోని అన్ని రాజధానుల్లో మహిళా బ్యాంకు శాఖలను ఏర్పాటు చేయాలని రిజర్వు బ్యాంకును చిదంబరం కోరారు. భారతీయ మహిళా బ్యాంకు ఛైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ ఉషా అనంత సుబ్రమణియన్ మాట్లాడుతూ.. ఇతర బ్యాంకులు రుణాలు ఇవ్వని కేటరింగ్ వ్యాపారం, శిశు సంరక్షణ కేంద్రాలు, వంట గదుల నవీకరణ వంటి మహిళా ప్రాధాన్యం కలిగిన వాటికి బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications