
ఆర్థిక వృద్ధి ప్రక్రియలో భాగంగా నైపుణ్య అభివృద్ధిని, వృత్తిపరమైన శిక్షణను పెంపొందించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించిన వృత్తిపరమైన శిక్షణను అందించగలిగతే వృద్ధికి ఊతం లభిస్తుందని, ఆ విధంగా ఆర్థిక ప్రగతికి మార్గం సుగమం అవుతుందని ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ఏ ఆర్థికాభివృద్ధి అయినా సామాజిక పరిణామాల కోణంలోనే విస్తరిస్తుందని ఆయన అన్నారు.
భారత్ 2030 నాటికి జనాభాపరంగా విస్తృతమైన మార్పులు వస్తాయని, అప్పటికీ 50శాతానికి పైగా జనాభా ‘వర్క్ ఫోర్స్' వయసు కలిగి, ప్రపంచంలోనే అత్యధిక జనశక్తి భారత్‌లోనే ఉంటుందని ఆయన వెల్లడించారు. అప్పటి పరిస్థితిని బట్టి ఉపాధి యోగ్యతా లభ్యతను బట్టి నైపుణ్యస్థాయి పెరగకపోతే ప్రపంచ పోటీకి అనుగుణంగా భారత్ ముందుకెళ్లే అవకాశం ఉండదని ఆయన తెలిపారు. వర్తమాన ఆర్థిక పరిస్థితులతోపాటు భవిష్యత్ నైపుణ్య అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని విధానాల రూపకల్పన జరగాలన్నారు.
సమీకృత వృద్ధి లక్ష్యాలు నెరవేరాలంటే దాని పరిధిలోకి అన్ని వర్గాల ప్రజలకు అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు. ఈ వర్గాల ప్రజల కోసం అభివృద్ధి ప్రక్రియకు సంబంధించి స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలన్నారు. ఆ విధంగా జరిగినప్పుడే పర్యావరణహితమైన రీతిలో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుందని, సుస్థిర ప్రగతి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.
కాగా గురువారం ప్రారంభమైన భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన 14రోజులపాటు జరుగుతుంది. ఈ సందర్బంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల విభాగాలు, ప్రయివేట్ సంస్థలు ఆయా రంగాల్లో సాధించిన ప్రగతికి సంబంధించిన అనేక అంశాలను, వృద్ధిపరమైన విజయాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ప్రతి రోజూ 1.6లక్షల మంది సందర్శిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోపాటు కేంద్ర మంత్రులు ఆనంద్‌శర్మ, ఫరూక్ అబ్దుల్లా, దక్షిణాఫ్రికా ప్రతినిధి ఎలిజబెత్ థాబేట్‌లు హాజరయ్యారు.


Click it and Unblock the Notifications