
ఈ త్రైమాసికంలో మొత్తం రాబడి 6 శాతం వృద్ధితో 49,917 కోట్ల రూపాయల నుంచి 53,118 కోట్ల రూపాయలకు చేరింది. బ్యాంకు చైర్‌పర్సన్‌గా అరుంధతీరాయ్ భట్టాచార్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెలువడిన త్రైమాసికం ఫలితాలు కావడంతో మార్కెట్ వర్గాలు ఆసక్తితో ఎదురుచూశాయి. మొండి బకాయిలకు, సిబ్బంది వేతనాల్లో పెరుగుదలకు, పెన్షన్లకు, ఇన్వెస్ట్‌మెంట్ల తరుగుదలకు.. కేటాయింపులు చేయడంతో లాభం భారీగా తగ్గినట్టు అరుంధతీరాయ్ తెలిపారు.
విద్యుత్, మౌలిక వసతుల రంగంలోని కంపెనీలకు ఎస్‌బిఐ భారీ ఎత్తున రుణాలు ఇచ్చింది. ఆర్థిక రంగంలో మందగమనం కారణంగా ఈ రంగాలు డీలాపడటం బ్యాంకు అంచనాలను దెబ్బతీసింది. బ్యాంకు కేవలం మొండి బకాయిల పద్దుల కింద 2,645 కోట్ల రూపాయలను కేటాయించింది. గత ఏడాది కేటాయింపులు 1,837 కోట్ల రూపాయలతో పోలిస్తే ప్రొవిజనింగ్ 44 శాతం పెరిగింది.
బ్యాంకు మంజూరు చేసిన రుణాల్లో స్థూల మొండి బకాయిల మొత్తం ఈ త్రైమాసికంలో 5.64 శాతానికి చేరింది. నికర మొండి బకాయిల పద్దుల మొత్తం 2.91 శాతం ఉంది. సెప్టెంబర్ చివరకు నికర వడ్డీ మార్జిన్ 3.51శాతం ఉంది. డిపాజిట్లు 14.01శాతం పెరిగి రూ.11,33,644 కోట్ల నుంచి రూ. 12,92,456 కోట్ల చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థానికి బ్యాంకు స్టాండ లోన్ నికర లాభం 24.21శాతం తగ్గి రూ. 5,616 కోట్లకు చేరితే మొత్తం ఆదాయం రూ. 65,368. 95 కోట్లనుంచి రూ. 73,392.54 కోట్లకు పెరిగింది.


Click it and Unblock the Notifications