హైదరాబాద్: నగరంలోని అపోలో క్యాన్సర్ ఆస్పత్రిలో బాలల దినోత్సవం సందర్భంగా క్యాన్సర్‌తో బాధితులైన చిన్నారులతో నిర్వాహకులు వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు టెన్సిస్ స్టార్ సానియా మీర్జా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్యాన్సర్ బారిన పడి ఇప్పుడు సాధారాణ జీవితాన్ని గడుపుతున్న చిన్నారులు రియల్ హీరోలని అన్నారు. క్యాన్సర్‌ను జయించి, సాధారణ జీవితాన్ని గడపగలమనే బలమైన సందేశాన్ని ఈ చిన్నారులు ప్రజల్లోకి తీసుకెళ్లారని అన్నారు. సానియా మిర్జా చిన్నారుల ఆట, పాటలను ఆస్వాదించారు.
తను మూడు శస్త్ర చికిత్సలు చేయించుకున్నట్లు తెలిపారు. ఆ సమయంలో అది తన జీవితంలో క్లిష్టమైనది భావించానని, అయితే క్యాన్సర్ బారిన పడిన చిన్నారులను చూశాక అది చాలా చిన్న గాయంగా అనిపిస్తుందని సానియా మీర్జా చెప్పారు. ఆమె తాత క్యాన్సర్ కారణంగానే చనిపోయారని, ఆ సమయంలో క్యాన్సర్ కు చికిత్స అంతగా అభివృద్ధి చెందలేదని చెప్పారు. కానీ నేడు చికిత్స అభివృద్ధి చెందిందని, అపోలో క్యాన్సర్ ఆస్పత్రి వైద్యులు క్యాన్సర్‌ను విజయవంతంగా ఎదుర్కొనే స్థాయిలో ఉన్నారని అన్నారు.

చిన్నారులతో సానియా
అపోలో ఆస్పత్రిలో బాలల దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టెన్సిస్ స్టార్ సానియా మీర్జా హాజయ్యారు. క్రిష్ మాస్కులను ధరించిన క్యాన్సర్ బాధిత చిన్నారుల ఆటపాటలను ఆమె ఆస్వాదించారు.

చిన్నారికి సానియా అభినందనలు
అపోలో ఆస్పత్రిలో బాలల దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టెన్సిస్ స్టార్ సానియా మీర్జా హాజయ్యారు. ఈ సందర్భంగా క్యాన్సర్‌ను జయించిన ఓ చిన్నారికి సానియా అభినందనలు తెలుపుతున్న దృశ్యం.

క్రిష్ మాస్కు తొడుగుతూ..
అపోలో ఆస్పత్రిలో బాలల దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాన్సర్‌ను జయించిన తన కుమారుడికి క్రిష్ మాస్కును తొడుగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్న ఓ మాతృమూర్తి.

చిన్నారి క్రిష్‌తో ఓ తండ్రి
అపోలో ఆస్పత్రిలో బాలల దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వ్యాధిని జయించిన తన కుమారుడికి క్రిష్ మాస్కు ధరింపజేస్తున్న ఓ తండ్రి. ఈ కార్యక్రమంలో క్యాన్సర్ బాధిత చిన్నారులు తమ ఆటపాటలతో అలరించారు.
ఈ సందర్భంగా అపోలో క్యాన్సర్ ఆస్పత్రి డైరెక్టర్, డాక్టర్ పి విజయ్ ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ.. క్యాన్సర్ వ్యాధి పిల్లలను ఏమి చేయలేదని అన్నారు. దేశంలో ప్రతియేటా సుమారు 45వేల కొత్త కేసులు బాల్యంలోని క్యాన్సర్ వ్యాధిలో నిర్ధారణ జరుగుతున్నాయని తెలిపారు. దేశంలోని క్యాన్సర్ గణాంకాలలో సుమారు 4.5శాతం చిన్నతనంలో వచ్చే క్యాన్సర్‌కు (10లక్షల మందిలో 70మంది) చెందినవని చెప్పారు. పెద్దవారి కంటే చిన్న పిల్లలో క్యాన్సర్‌ను తట్టుకుని, కోలుకునే శక్తి ఎక్కువగా ఉంటుందని, చిన్న పిల్లల్లో క్యాన్సర్‌ను నివారించవచ్చని ఆయన తెలిపారు. సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ క్యాన్సర్ వైద్య నిపుణుడు డా. ఎస్‌విఎస్‌ఎస్ ప్రసాద్ బాల్యంలో వచ్చే క్యాన్సర్ పై సవివరింగా తెలియజేశారు.
క్యాన్సర్ నుంచి బయట పడిన చిన్నారులతోపాటు వారి తల్లిదండ్రులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. క్యాన్సర్ బారినపడిన చిన్నారులతో వారి అనుభవాలను పంచుకున్నారు. తమ చిన్నారికి క్యాన్సర్ ఉందని చెప్పడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యామని, వైద్యుల కౌన్సిలింగ్‌తో కొంత విశ్వాసం కలిగిందని, ప్రస్తుతం క్యాన్సర్ నుంచి బయటపడిన తమ చిన్నారిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని ఓ చిన్నారి తండ్రి ఈ సందర్భంగా తెలిపారు. తమ చిన్నారుల చదువు కొనసాగుతుందన్న నమ్మకం ఉందని, ఈ అవకాశాకాన్ని కల్పించిన ఆస్పత్రి వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications