
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, సిఐఐ సంయుక్తంగా నిర్వహించిన ‘సర్వీసెస్ కన్‌క్లేవ్'లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ఉత్తర అమెరికాకు దేశీయ ఎగుమతులు బలంగా ఉన్నాయని, అలాగే ప్రపంచంలోని ఇతర పెద్ద మార్కెట్లలోనూ బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో భారతీయ సేవారంగం ఇప్పటికీ చాలా తక్కువ వాటాను కలిగి ఉందని ఆనంద్ శర్మ తెలిపారు.
అందువల్ల ఐటి, టెలీ కమ్యునికేషనేషన్ రంగాలే కాకుండా హెల్త్‌కేర్, టూరిజం, ఫైనాన్షియల్ సేవలపైనా దృష్టి సారించి అంతర్జాతీయంగా గణనీయమైన ఎగుమతులను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం దేశ జిడిపిలో సేవారంగం వాటా 60 శాతంగా ఉంటే, ఉపాధి కల్పనలో 35 శాతం, వాణిజ్యంలో 25 శాతం, ఎగుమతుల్లో 40 శాతం, దిగుమతుల్లో 20 శాతం, దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 50 శాతానికిపైగా వాటా ఉంది.
పంటర్లకు మయారాం హెచ్చరిక
ప్రస్తుతం మార్కెట్‌లో రూపాయి పతనానికి కారకులవుతున్న కరెన్సీ పంటర్లు త్వరలో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మయారాం హెచ్చరించారు. డాలర్ల ప్రవాహం పెరగడం వల్ల త్వరలోనే రూపాయి పతనానికి అడ్డుకట్ట పడి మన కరెన్సీ విలువ బలపడగలదని ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఈ సందర్భంగా మయారాం మాట్లాడారు. ఫారెక్స్ మార్కెట్లో అసంబద్ధమైన, అర్థంపర్థంలేని ప్రతికూల సెంటిమెంట్ ఉందని ఆయన అన్నారు.
రూపాయిపై స్పెక్యులేట్ చేస్తున్నవారిని ఉద్ధేశించి ఆయన ఘాటుగా స్పందించారు. పంటర్లు దారుణంగా నష్టపోతారని, వారి కుటుంబాలకు తాను సానుభూతి తెలుపుతున్నానని ఆయన తెలిపారు. అయితే డాలర్లను ఆకర్షించేందుకు రిజర్వు బ్యాంకు ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఫారెక్స్ స్వాప్ విండో మంచి ఫలితాలు ఇస్తోంది. నవంబర్‌లో ఈ ప్రత్యేక సౌకర్యం గడువు ముగుస్తుంది. కాగా ఈ లోపే స్వాప్ విండో ద్వారా 2,500-3,000 కోట్ల డాలర్లు వచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖ భావిస్తోంది.


Click it and Unblock the Notifications