
దేశంలో మొత్తం 17లక్షల మంది సర్వీస్ టాక్స్ అసెసీలున్నారని, వారిలో ఏడు లక్షలమంది మాత్రమే క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయని ఆయన చెప్పారు. పన్ను బకాయిదారులంతా స్వచ్ఛందంగా పన్నులు చెల్లించాలనే వాలంటరీ కంప్లియెన్స్ ఎంకరేజ్‌మెంట్ స్కీమ్ (విసిఇఎస్)ను అందుబాటులోకి తీసుకొచ్చామని చిదంబరం తెలిపారు.
ఈ నేపథ్యంలోనే వివిధ వాణిజ్య, పరిశ్రమల సంఘాల ప్రతినిధులతో చిదంబరం సోమవారం సమావేశమయ్యారు. ఎవరినైతే ఉద్దేశించి విసిఇఎస్ స్కీమ్‌ను తీసుకొచ్చామో వారంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిజానికి చాలామంది కొంతకాలం పన్నులు చెల్లించారన్న ఆయన ఆ తర్వాతే ఆపేశారని తెలిపారు. పన్ను ఎగవేతదారు అనే ముద్ర నుంచి బయటపడి వ్యాపారంలో కొత్త శకాన్ని ప్రారంభించేందుకు అవకాశం కల్పించడమే విసిఇఎస్ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.
భారత్ లో పెప్సికో పెట్టుబడులు: ఏడేళ్ళలో రూ. 33వేల కోట్లు
భారత్‌లో కార్యకలాపాల విస్తరణకు 2020 నాటికి పెప్సికో రూ. 33వేల కోట్ల (55 కోట్ల డాలర్లు) పెట్టబడులు పెట్టనున్నట్లు పెప్సికో ఛైర్ పర్సన్, సిఈఓ ఇంద్రా నూయి తెలిపారు. కొత్త ఉత్పత్తుల అభివృద్ధి, తయారీ, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం తదితర రంగాల్లో కంపెనీ తన సామర్థ్యాలను ప్రస్తుత స్థాయి నుంచి రెట్టింపు చేసుకోవడానికి ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు ఆమె చెప్పారు.
ఈ అమెరికా దిగ్గజ కంపెనీ 1989లో భారత్‌లో అడుగుపెట్టింది. భారత్‌లో రెండు రోజుల పర్యటన కోసం వచ్చిన నూయి, సోమవారం ఆర్థిక మంత్రి చిదంబరంతో భేటీ అయ్యారు. పెప్సీ కుర్రోళ్ల బ్రాండ్, కోకాకోలా వయసు మళ్లినవారికని ఇంద్రా నూయి తెలిపారు. భారత్‌లో ప్రత్యర్థికి భిన్నమైన వ్యాపార వ్యూహాన్ని ఆమె అనుసరిస్తున్నారు. థమ్సప్, స్థానిక బ్రాండ్‌లను కోకకోలా కొనుగోలు చేసింది. అయితే ఈ రెండు కంపెనీల మధ్య అనేక వ్యత్యాసాలున్నాయని, బ్రాండ్ ఈక్విటీ స్కోరును పరిశీలించినట్లయితే పెప్సీకి ఉన్న ఆదరణ తెలుస్తుందని ఆమె తెలిపారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications