For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పబ్లిక్ కంపెనీగా టాటా సియా ఎయిర్ లైన్స్

|

Tata, SIA incorporate airline venture- Tata SIA Airlines Ltd
న్యూఢిల్లీ: టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్(ఎస్‌ఐఎ) సంయుక్త సంస్థ టాటా-సియా ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ విమానయాన సేవల పనులు వేగంగా జరిగిపోతున్నాయి. ఇందులోభాగంగానే ఈ సంయుక్త సంస్థ పేరు ఇప్పుడు న్యూఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయింది. ఇందుకు అవసరమైన అన్ని పత్రాలు, వివరాలను కంపెనీ వ్యవహారాల శాఖకు సమర్పించారు. ఫలితంగా ఈ సంయుక్త సంస్థ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా అవతరించింది.

కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్దనున్న సమాచారం ప్రకారం నవంబర్ 5న టాటా-సియా 5 లక్షల రూపాయలు మూలధనం చెల్లించి, సంబంధిత పత్రాలన్నింటినీ సమర్పించింది. సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల వివరాలను, పెట్టుబడులు, వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలను అందజేసింది. సంయుక్త సంస్థలోని బోర్డులో డైరెక్టర్లుగా విధులు నిర్వర్తిస్తున్న ప్రసాద్ మీనన్‌తోపాటు కేర్సి రూస్టోమ్ భగత్, ముకుంద్ గోవింద్ రాజన్‌లు సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు.

కాగా సంయుక్త సంస్థలో 51 శాతం వాటాతో టాటా సన్స్ లిమిటెడ్, 49 శాతం వాటాతో సింగపూర్ ఎయిర్‌లైన్స్ కలిసి ఏర్పాటైన సంయుక్త సంస్థే టాటా-సియా ఎయిర్‌లైన్స్ లిమిటెడ్. ఇప్పటికే ఈ సంయుక్త సంస్థకు విదేశీ పెట్టుబడుల ప్రగతి బోర్డు (ఎఫ్‌ఐపిబి) ఆమోదం లభించగా, అనంతరం టాటా-సియా ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ పేరును వెంచర్ ఉపయోగించుకోవచ్చని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా అనుమతిచ్చింది.

కాగా దేశీయంగా విమానయాన సేవలు అందించేందుకు ఎయర్ ఆసియా సంస్థతోనూ టాటా గ్రూప్ జాయంట్ వెంచర్‌ను నిర్వహి స్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత సంయుక్త సంస్థకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన పత్రాలన్నింటినీ సమర్పించి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా టాటా-సియా ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ అవతరించింది. దేశీయంగా, అంతర్జాతీయంగా సంయుక్త సంస్థలో విమానాలను నడపనున్నారు.

English summary

పబ్లిక్ కంపెనీగా టాటా సియా ఎయిర్ లైన్స్ | Tata, SIA incorporate airline venture- Tata SIA Airlines Ltd

Gearing up to launch full-service airline on domestic and international routes, salt-to-software conglomerate Tata group has incorporated its proposed aviation venture Tata SIA Airlines Ltd as a public limited company with the filing of all requisite documents and details with the Corporate Affairs Ministry.
Story first published: Monday, November 11, 2013, 10:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X