
2013 సంవత్సరానికి 50 మంది శక్తిమంతమైన మహిళా వ్యాపారవేత్తలతో కూడిన జాబితాను ఫార్చ్యూన్ మేగజైన్ విడుదల చేసింది. ఈ జాబితాలో అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతారెడ్డి నాలుగో స్థానంలో నిలిచారు. జాబితాలో అగ్రస్థానాన్ని స్థానాన్ని వరుసగా మూడో ఏడాది కూడా ఐసిఐసిఐ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సిఈఓ చందా కొచ్చర్ దక్కించుకున్నారు. యాక్సిస్ బ్యాంక్ సిఈఓ శిఖా శర్మ, క్యాప్ జెమినీ సిఈఓ అరుణా జయంతిలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
ఈ జాబితాలో కొత్తగా ఆరుగురికి స్థానం లభించింది. వీరిలో షెల్ ఇండియా ఛైర్ పర్సన్ యాస్మిన్ హిల్టన్, ఐబిఎం ఇండియా ఎండీ వినీతా బాలి, వ్యవస్థాపకురాలు అనితా డోంగ్రే, ఎల్ అండ్ టి ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్ మెంట్ సిఈఓ ఆషు సూయాష్, టాటా స్టార్ బక్స్ ఇండియా సిఈఓ అవానీ సగ్లానీ దావ్డా, హెరిటేజ్ ఫుడ్స్ వైస్ ఛైర్మన్, ఎండీ నారా భువనేశ్వరి, బాలాజీ టెలీఫిల్మ్స్ కు చెందిన ఏక్తాకపూర్, ఎస్ఎస్ఈ ఎండీ చిత్రా రామకృష్ణ, హెచ్‌డిఎఫ్‌సి ఎండీ రేణూసూద్ కర్నాడ్‌లు ఉన్నారు.
టఫే కంపెనీ సిఈఓ మల్లికా శ్రీనివాసన్ ఐదో స్థానంలో నిలిచారు. కాగా జాబితాలోని మొదటి పది స్థానాల్లో ఉన్న మహిళల్లో హెచ్‌టి మీడియా చైర్‌పర్సన్ శోభనా భాటియా, బయోకాన్ చైర్ పర్సన్, ఎండి కిరణ్ మజుందార్‌షా, ఎజడ్‌బి పార్టనర్స్ సహా వ్యవస్థాపకురాలు జియా మోడీ, బ్రిటానియా ఇండస్ట్రీస్ ఎండి వినితా బాలి, హెచ్ఎస్‌బిసి ఇండియా కంట్రీ హెడ్ నైనాలాల్ కిద్వాయ్ ఉన్నారు.


Click it and Unblock the Notifications