భారత రేటింగ్‌లో కోత?: ఎస్‌ అండ్‌ పి హెచ్చరిక

India's credit rating at risk S&P warns
న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం విశ్వసనీయమైన వృద్ధి ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లడంలో విఫలమైనట్లయితే భారత్ రేటింగ్ పడిపోతుందని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్ అండ్ పి) గురువారం హెచ్చరించింది. సాధారణ ఎన్నికల కన్నా ముందుగా భారత ఆర్థిక స్థితిగతులు గానీ, విదేశీ ఖాతాలు గానీ అనూహ్యంగా దిగజారిపోని పక్షంలో తదుపరి ఎన్నికలు ముగిశాక అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వం తన పాలిసీ ఎజెండాను ప్రకటించిన తరువాత భారత్ రేటింగ్‌ను సమీక్షించే అవకాశం ఉందని ఎస్ అండ్ పి ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుతానికి భారత్‌కు ప్రతికూల దృక్పథం(నెగెటివ్ ఔట్‌లుక్)తో కూడిన ‘బిబిబి మైనస్' రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ‘బిబిబి మైనస్' అనేది అత్యల్ప ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్. ఇంతకన్నా రేటింగ్ తగ్గడమంటే దేశ సావరిన్ రేటింగ్ జంక్ స్టేటస్‌కు పడిపోతుంది. దీనివల్ల కార్పొరేట్లు విదేశాల నుంచి తెచ్చుకున్న రుణాలపై వడ్డీ పెరుగుతుంది. ఎస్ అండ్ పి గత సంవత్సరం ఏప్రిల్‌లో భారత్‌కు నెగెటివ్ ఔట్‌లుక్ రేటింగ్‌ను ఇచ్చింది.

అయితే వచ్చే ఏడాది ఎన్నికల అనంతరం భారత్‌లో గద్దెనెక్కే ప్రభుత్వం వృద్ధికి దన్నుగా నిలిచే నిర్ణయాలను తీసుకొని, మరిన్ని సంస్కరణలను ప్రవేశపెట్టినట్లయితే రేటింగ్‌ను ప్రతికూలం నుంచి స్థిరత్వ స్థాయికి పెంచే అవకాశముందని ఎస్ అండ్ పి పేర్కొంది. భారత్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి 2014 మే లోపు సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది.

అయితే ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం తక్కువగా ఉన్న భారత వృద్ధి రేటును పెంచగలిగే స్థితిలో కనపడకపోతే దేశ రేటింగ్ మరింత పడిపోతుందని ఎస్ అండ్ పి తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ 2012-13 ఆర్థిక సంవత్సరంలో 5 శాతానికి క్షీణించిన విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం కూడా భారత్ ఇదే స్థాయి వృద్ధి రేటును నమోదు చేసుకుంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్ కేవలం 4.4 శాతం వృద్ధి రేటునే నమోదు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+