
నిధుల సమీకరణ వ్యయం పెరుగుతున్న కారణంగా వడ్డీ రేట్లను పెంచాల్సి వచ్చిందని బ్యాంకు ఛైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. తాము గతంలో వడ్డీ రేట్లను సవరించిన తర్వాత రెండు విడతల్లో ఆర్‌బిఐ రెపో రెటును 0.5 శాతం మేర పెంచినట్టుగా ఆమె చెప్పారు. అయితే తాము రెపో రెటుకు అనుగుణంగా వడ్డీ రేట్లను పెంచకుండా కేవలం 0.2 శాతానికి పరిమితమైనట్టు ఆమె తెలిపారు.
అయితే జనవరి 31, 2014 వరకు ఇచ్చే రుణాలకు తక్కువ రేట్లను ఆఫర్ చేస్తున్నట్లు ఎస్‌బిఐ తెలిపింది. అదే సమయంలో ప్రామాణిక కనీస రుణ రేటు (బిపిఎల్‌ఆర్)ను సైతం 14.55 శాతంనుంచి 14.75 శాతానికి పెంచింది. ఎస్‌బిఐ తన వడ్డీ రేట్లను పెంచడంతో మిగతా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా త్వరలోనే తమ వడ్డీ రేట్లను పెంచే అవకాశముంది.
ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి తన వడ్డీ రేట్లను మంగళవారం 0.20 శాతం పెంచిన ఒక రోజు తర్వాత ఎస్‌బిఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గత వారం రిజర్వ్ బ్యాంక్ తన స్వల్పకాలిక వడ్డీ రేటు (రెపో రేటు)ను 0.25 శాతం పెంచిన విషయం తెలిసిందే. మరో ప్రైవేటు బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేట్లను 0.25 శాతం వరకు సవరించినట్టు ప్రకటించింది.
కోటి రూపాయల లోపు ఉన్న డిపాజిట్లకు సవరించిన రేట్లు వర్తిస్తాయని తెలిపింది. 13 నుంచి 15 నెలల కాలపరిమితి గల డిపాజిట్ల రేట్లను (పావుశాతం పెంచి) 8.50 శాతం నుంచి 8.75 శాతానికి పెంచారు. 61 రోజుల నుంచి 6 నెలల కాలపరిమితి గల డిపాజిట్ల రేట్లపై పావుశాతం కోత వేసి 8.5 శాతానికి చేర్చింది. 46 నుంచి 60 రోజుల డిపాజిట్లపై అరశాతం తగ్గించి 8.5 శాతంగా వడ్డీరేటును నిర్ణయించింది. సవరించిన రేట్లు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.


Click it and Unblock the Notifications