
ఈ జాబితాలో 2వ స్థానంలో బహ్రెయిన్, 4వ స్థానంలో కేమన్ ఐస్ లాండ్స్, 5వ స్థానంలో ఆస్ట్రేలియా, 9వ స్థానంలో స్పెయిన్, 10వ స్థానంలో బ్రెజిల్ దేశాలు ఉన్నాయి. తమ పరిశోధన ద్వారా ఆసియా దేశాలు కూడా నాణ్యమైన జీవితాలను ప్రజలకు అందించడంలో ముందున్నాయని తెలిసిందని హెచ్ఎస్‌బిసి ఎక్స్‌పాట్ హెడ్ డీన్ బ్లాక్ బర్న్ అన్నారు.
ప్రస్తుతం తాము నిర్వహించిన పరిశోధనలో ఎక్కువ ఆసియా దేశాలు చోటు దక్కించుకున్నాయని ఆయన తెలిపారు. యూగోవ్ అనే పరిశోధన సంస్థతో ఈ సర్వేను నిర్వహించినట్లు హెచ్ఎస్‌బిసి ఎక్స్‌పాట్ తెలిపింది. వివిధ దేశాల్లోని ఎంపిక చేసుకున్న సుమారు 7,004 మంది వ్యక్తుల ద్వారా ఆన్‌లైన్ సర్వే నిర్వహించినట్లు పేర్కొంది.
భారతదేశంలోని ప్రతీ పది మందిలో ఏడుగురు వ్యక్తులు తమ జీవితంపై అనుకూలమైన వైఖరి(సంతృప్తి)ని వ్యక్తం చేశారని హెచ్ఎస్‌బిసి ఎక్స్‌పాట్ తెలిపింది. ఇతర దేశాలతో పోల్చినట్లయితే తమ దేశంలో సామాజిక జీవితాన్ని మెరుగ్గా గడుపుతున్నామని భారతదేశంలోని ప్రజలు పేర్కొన్నట్లు తెలిపింది. ఇక్కడి వాతావరణం, వంటకాలు, సంస్కృతిని విదేశీయులు కొంత సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుందని సర్వే పేర్కొంది.
కాగా ఉన్నత జీవన ప్రమాణాలు కలిగిన యూరోపియన్ దేశాలు పర్యాటకులను ఆకట్టుకునేలా ఉన్నట్లు సర్వే తెలిపింది. ఈ జాబితాలో జర్మనీ అగ్రస్థానంలో నిలిచింది. మూడవ స్థానంలో ఫ్రాన్స్, 6వ స్థానంలో బెల్జియం, 9వ స్థానంలో స్పెయిన్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications