ఆల్‌టైమ్ రికార్డు: స్టాక్ మార్కెట్లకు ముందే దీపావళి

గురువారం ఈ జోష్‌కొనసాగితే, స్టాక్ మార్కెట్లో దీపావళి సంబరాలు ముందుగానే మిన్నంటుతాయి. కాగా 2010 నవంబర్ 5న సెన్సెక్స్ 21,004.96 పాయింట్ల రికార్డును సృష్టించిన తర్వాత ఇప్పుడు ఆ రికార్డును కూడా మార్కెట్ అధిగమించింది. ఒక దశలో సెన్సెక్స్ 21,206.77 పాయింట్ల స్థాయికి చేరుకుని 2008 జనవరి 8న సృష్టించిన రికార్డును సమం చేసింది.
ఫ్యూచర్స్, అప్షన్స్ అక్టోబర్ కాంట్రాక్ట్‌ల గడువు శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున స్వల్పకాలిక సర్దుబాట్లు చోటు చేసుకోవడంతో పాటుగా విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున మార్కెట్లోకి రావడం, అంతర్జాతీయ మార్కెట్లనుంచి సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ పరుగులు తీసింది. 13 సూచీల్లో 11 లాభాలతో ముగిసాయి. ఫలితాలు నిరుత్సాహం కలిగించినా భారతీ ఎయిర్‌టెల్ 5.23 శాతం లాభంతో ముగిసింది.
ఐటిసి, ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి, డాక్టర్ రెడ్డీస్ లాబ్, టిసిఎస్, బజాజ్ ఆటో భారీ లాభాలతో ముగివాశాయి. హెల్త్‌కేర్, ఎఫ్ఎంసిజి షేర్లు దూసుకుపోయాయి. ఐసిఐసిఐ మినహాయిస్తే ఇతర బ్యాంకు షేర్లలో కదలిక పెద్దగా కనిపించలేదు. విప్రో నష్టాలతో ముగిసింది. ద్వితీయ త్రైమాసికం ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండటంతో రాన్‌బాక్సీ షేరు ధర ఇంట్రాడేలో 6 శాతం నష్టపోయింది.
అయితే అనూహ్యంగా కొనుగోళ్లు పెరగడంతో చివరలో 3 శాతం లాభంతో ముగిసింది. టాటా కమ్యూనికేషన్స్ షేరు ధర ఏకంగా 10 శాతం లాభంతో ముగిసింది. డాక్టర్ రెడ్డీస్ గురువారం ఆర్థిక ఫలితాలను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో షేరులో భారీగా స్పెక్యులేటివ్ కొనుగోళ్లు జరిగాయి. ఎన్ఎస్ఈకి చెందిన నిఫ్టీ సైతం దాదాపు 31 పాయింట్లు లాభపడి 6,251.70 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా చైనా, జపాన్, హాంకాంగ్, తైవాన్, సింగపూర్, దక్షిణ కొరియా లాంటి ప్రధాన ఆసియా మార్కెట్లన్నీ కూడా లాభాలతో ముగిసాయి.


Click it and Unblock the Notifications