
టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, సికోర్‌స్కై ఎయిర్ క్రాఫ్ట్స్ కార్పోరేషన్‌ల జాయింట్ వెంచర్ భారత్‌లో ఎస్-92 రకం 50వ హెలికాప్టర్ క్యాబిన్ తయారీని పూర్తి చేసింది. 2011లో హెలికాప్టర్ క్యాబిన్‌లను ఉత్పత్తి చేయడం ప్రారంభించిన తర్వాత విజయవంతంగా వీటి ఉత్పత్తి జరుగుతోంది. 50వ హెలికాప్టర్ క్యాబిన్‌ను హైదరాబాద్ సమీపంలోని ఆదిభట్లలోని టాటా సంస్థ ఆవరణలో గురువారం విడుదల చేశారు.
టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీలో నూటికి నూరుశాతం స్వదేశీ విజ్ఞానంతో దీన్ని పొందించారు. ఎస్-92 హెలికాప్టర్ క్యాబిన్‌తోపాటు 5వేలకు పైగా ఏరోస్పేస్ విడిభాగాలను హైదరాబాద్‌లోని సికోర్‌స్కై-టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టిఎఎస్‌ఎల్) సంయుక్తంగా తయారు చేస్తున్నాయి. 2009లో ఏర్పాటైన ఈ భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించి హైదరాబాద్‌లోని తమ కేంద్రంలోనే పూర్తి స్థాయి హెలికాప్టర్ తయారుచేయాలన్న దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు సికోర్‌స్కీ కార్పొరేషన్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ (భారత్, దక్షిణాఫ్రికా) రిటైర్డ్ ఎయిర్ వైస్ మార్షల్ అరవింద్ వాలియా తెలిపారు.
ప్రస్తుతం ఎస్-92 హెలికాప్టర్ల క్యాబిన్లను పూర్తి దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేస్తున్నామని చెప్పారు. పూర్తి స్థాయి హెలికాప్టర్‌ను ఇక్కడ నుంచి తయారుచేయాలన్న తమ లక్ష్యసాధనలో ఇది ఒక ముందడుగు అని ఆయన అన్నారు. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ కంపెనీ తయారుచేస్తున్న ఈ క్యాబిన్లకు ఇప్పటివరకు కొన్ని పరికరాలను దిగుమతి చేసుకునే వారమని, కొత్తగా విడుదల చేస్తున్న 50వ క్యాబిన్‌కు అవసరమైన అన్ని విడిభాగాలను తమ భాగస్వామ్యంలోని టాటా సికోర్‌స్కీ సంస్థ అందించిందని ఆయన తెలిపారు.
ప్రముఖుల రాకపోకల కోసం దేశీయ వైమానిక దళానికి హెలికాప్టర్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అరవింద్ చెప్పారు. రూ. 3600 కోట్లతో అగస్టా వెస్ట్ ల్యాండ్ సంస్థ నుంచి ఏడబ్ల్యూ 101 రకం 12 హెలికాప్టర్ల కొనుగోలుకు చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకు ప్రభుత్వం తుది షోకాజు నోటీసు జారీ చేసిన నేపథ్యంలో తమకు ఆ అవకాశం ఇస్తే అంగీకరిస్తామని తెలిపారు. దేశీయ విడిభాగాలతో ఎస్ 92 హెలికాప్టరు క్యాబిన్లు తయారు చేస్తున్న సమయంలో, ఈ ఒప్పందం కుదిరితే మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందన్నని ఆయన అన్నారు.
అంతకు ముందు వేడుకగా జరిగిన ఒక కార్యక్రమంలో ఈ యూనిట్‌లో తయారయిన 50 క్యాబిన్‌కు సంబంధించిన పత్రాలను టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ చైర్మన్ రామదొరై సికోర్‌స్కీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షేన్ ఎడ్డీకి అందజేశారు. ఇది పూర్తిగా భారతీయ నిపుణుల ప్రతిభ, దృఢ సంకల్పానికి దర్పణమని షేన్ ఎడ్డీ అన్నారు. తమ భాగస్వామ్యం మరిన్ని విజయాలు సాధిస్తుందన్న విశ్వాసం ఆయన ప్రకటించారు.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications