ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌లో అబ్దుల్ కలామ్
హైదరాబాద్: ఇన్ఫోటెక్ ఎంటర్ ప్రైజెస్ ఎండోమెంట్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ ఐ కేర్ ఆర్థిక సహకారం, ఎంఐటీ మీడియా లాబ్ సహకారంతో ఎల్‌వి ప్రసాద్ వైద్య విజ్ఞాన సంస్థ, కెమెరా కల్చర్ గ్రూప్ (ఎంఐటీ) శుక్రవారం ‘సృజన: ఇన్నోవేషన్ ఎట్ ఎల్‌విపిఇఐ' అనే ఎల్‌విపిఇఇ-మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. నూతన ఆవిష్కరణా కేంద్రాన్ని భారత మాజీ రాష్ట్రపతి డా. ఏపిజె అబ్దుల్ కలాం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముందు వర్కుషాపులో వారి ఆవిష్కరణల నమూనాలతో పని చేస్తున్న విద్యార్థులతో ఆయన మాట్లాడారు.
విద్యార్థలకు ఎల్ విపిఇఐలోని అధ్యాపకులు, ఎంఐటీ మీడియా లాబ్ కెమెరా కల్చర్ గ్రూపు మార్గనిర్దేశం చేస్తారు. విద్యార్థుల శక్తిని ‘ఇమేజింగ్ ది ఐ', అప్లికేషన్స్ అండ్ అల్గోరిథమ్స్, ప్రోగ్రామింగ్ పర్సెప్షన్, రీ ఇన్వెంటింగ్ విజన్' అనే నాలుగు విస్తృత విభాగాలుగా విభజించిన సమస్యల పరిష్కారానికి వినియోగించే విధంగా వీరు నిర్దేశిస్తారు. ఆవిష్కరణ కేంద్ర స్థాపనకు అత్యధిక ప్రభావిత సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ), కేంబ్రిడ్జ్, యూఎస్ఏతో ఎల్ విపిఇఐ క్రీయశీలక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది.

ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ స్థాపనాధ్యక్షులు డా. గుళ్లపల్లి ఎన్ రావు మాట్లాడుతూ.. ఈ ఆవిష్కరణ కేంద్రం మూలం జులై 2013లో ఎంఐటీ మీడియా లాబ్ సహకారంతో నిర్వహించిన ఇన్నోవేషన్ వర్కుషాపు అని తెలిపారు. ఎంఐటీ మీడియా లాబ్ కి ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆప్తల్మాలజీ భాగస్వామి అని చెప్పారు. ఎంఐటీలోని టాటా సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ డిజైన్, హైదరాబాద్ లోని బిట్స్ పిలానీ, పెర్కిన్స్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ ఈ వర్కుషాపులో ఇతర భాగస్వాములని తెలిపారు.
ఎంఐటీలోని శాస్త్రవేత్తలు నమూనాలను వాస్తవం చేయడానికి సాంకేతిక సాధనాలను రూపొందించారని తెలిపారు. ముఖ్యంగా వైద్యులు, ఇంజినీర్లు, డిజైనర్ల కలయిక అభివృద్ధి చెందుతున్న దేశాలలో అనేక నేత్ర సంరక్షణా సమస్యలను విజయవంతంగా సంబోధించగల బలీయమైన శక్తిగా రూపొందించగలదనే వాస్తవంతో ఈ వర్క్ షాపు ముగిసిందని చెప్పారు. ఈ వర్కుషాపులో వచ్చిన ప్రేరణను కొనసాగించడానికి ఎల్ విపిఇఐలో ఈ ఆవిష్కరణ కేంద్ర స్థాపన ఉద్భవించిందని ఆయన అన్నారు.
రోగులకు అత్యుత్తమ నేత్ర సంరక్షణ అందించడం, సమర్థవంతమైన చికిత్స, నేత్ర రోగ నిర్ధారణల నిర్వహణలకై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సామాజిక ఆర్థిక స్థితిగతులు, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉంచడం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరింత సులభతరం చేసి సరసమైన ధరలో ఇవ్వగలగాలగాలని ఆయన అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశం పర్యావరణానికి ప్రత్యేకమైన వినూత్న పరిష్కారాలను ఇవ్వాలని, ఆ పరిష్కారాలను సరికొత్త, ప్రస్తుత అవసరాలకు అనువర్తించడమే ఆవిష్కరణ అని డా. రావు అన్నారు.


Click it and Unblock the Notifications