చికెన్ వ్యాపారంలోకి శాకాహారి ముకేష్ అంబానీ

చికెన్ కేమ్ ఫస్ట్ పేరుతో నడిపే రెస్టారెంట్ చైన్ కెంటుకి ఫ్రయిడ్ చికెన్ (కెఎఫ్‌సి)తో పోటీ పడడానికి సిద్ధమవుతోంది. కెఎఫ్‌సి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందింది. 2 సిస్టర్స్ ఫుడ్ గ్రూప్ (2ఎస్ఎఫ్‌జి)కి చెందిన టూ సిస్టర్స్ ఫుడ్స్ ఇండియాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 45 శాతం ఈక్విటీ వాటాను తీసుకుంది. యుకెకు చెందిన 2ఎస్‌ఎఫ్‌జి పౌల్ట్రీ, రెడ్ మీట్, ఫిష్, బేకరీ, ఇతర చిల్డ్ - ఫ్రోజెన్ ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. రిటైల్, ఫుడ్ సర్వీస్, ఫుడ్ మ్యానుఫాక్చరింగ్ సెక్ట్రార్స్‌కు వాటిని సరఫరా చేస్తుంది.
రిలయన్స్ రిటైల్ ద్వారా ఆర్ఐఎల్ ఆ వాటను సొంతం చేసుకుంది. మిగతా 55 శాతం వాటా బ్రిటిష్ వ్యాపారవేత్త రంజిత్ సింగ్ బోపారన్ స్థాపించిన 2ఎస్ఎఫ్‌జి చేతిలో ఉంటుంది. ఆర్ఐఎల్ వాటా పొందిన టూ సిస్టర్స్ ఫుడ్స్ ఇండియా (టిఎస్ఎఫ్ఐ) తన ఫుడ్, గ్రోసరీ అవుట్‌లెట్ల ద్వారా చిల్ల్, ఫ్రోజెన్ ఆహార పదార్థాలను విక్రయిస్తుంది.
ఓ జాతీయ మీడియా సంస్థ కథనం ప్రకారం - చికెన్, ఫిష్, మీట్ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌కు జెవి ఫ్లాంట్‌ను స్థాపిస్తున్నట్లు సమాచారం. కొత్త ఉత్పత్తుల కోసం రిలయన్స్ రిటైల్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫుడ్ ఇన్నోవేషన్ ల్యాబ్‌ను ప్రారంభించింది.


Click it and Unblock the Notifications