
స్పెక్ట్రానెట్‌కు చెందిన హలో 'ఐపి సర్వీస్'పై నింబూజ్ భాగస్వామ్యంతో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తాయి. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కాలింగ్ సదుపాయాన్ని చాట్ వేదికగా తక్కువ ధరకే అందుబాటులోకి తెస్తారు. హలో ఐపి వేదికగా భారతీయ కస్టమర్లకు ఎలాంటి భారం లేని విధంగా అతి తక్కువ ధరకే అంతర్జాతీయ కాలింగ్‌ను అందుబాటులో ఉంచుతున్నామని, దీని ద్వారా నింబూజ్ యూజర్లకు మార్కెట్ ధరల కన్నా 450 శాతం తక్కువ ధరకే అంతర్జాతీయ కాల్స్ అందుబాటులోకి వస్తాయని నింబూజ్ సిఇఒ వికాస్ సక్సేనా తెలిపారు.
అమెరికా, కెనడా, బ్రిటన్‌లకు కాలింగ్ రేటు సెకన్‌కు ఒక పైసా ఉంటుందని, ఇతర దేశాల కాల్స్‌కు ధరల్లో కొంత వ్యత్యాసం ఉంటుందని ఆయన చెప్పారు. ఇందుకోసం ఏడు రోజులూ, 24 గంటలూ పని చేసే కాలింగ్ ఇమెయిల్ సపోర్ట్ వసతిని కూడా అందుబాటులోకి తెచ్చినట్టు స్పెక్ట్రానెట్ హలో ఐపి సిఇఒ ఉదిత్ మెహరోత్రా తెలిపారు. ఇది భారత్‌లోనే తొలి చట్టబద్ధమైన వాయిప్ (వాయిస్ ఓవర్ ఐపి) సర్వీస్ అని వారు చెప్పారు.
ప్రస్తుతానికి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల ద్వారా దీనికి చెల్లింపులు చేయవచ్చునని ఆయన తెలిపారు. త్వరలోనే ప్రీపెయిడ్ కార్డులు కూడా జారీ చేస్తామని ఆయన చెప్పారు. ఈ సదుపాయం వల్ల రెండున్నర కోట్ల మంది నింబూజ్ యూజర్లు లాభపడతారని సక్సేనా అన్నారు. వచ్చే ఏడాది, ఏడాదిన్నర కాలంలో యూజర్ల సంఖ్య రెట్టింపు అవుతుందని భావిస్తున్నట్టు వారు తెలిపారు.


Click it and Unblock the Notifications