
ఆర్థిక మంత్రి చిదంబరాన్ని, రెవెన్యూ శాఖ కార్యదర్శి సుమిత్ బోస్‌ను వారి కార్యాలయాల్లో కుమార మంగళవారం బిర్లా శుక్రవారం కలిశారు. ఆదిత్య బిర్లా గ్రూప్ కొత్త బ్యాంకు లైసెన్సు కోసం చేసిన దరఖాస్తుపై బొగ్గు గనుల కేసు ప్రభావం ఉంటుందని మీరు భావిస్తున్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ప్రస్తుతానికి తాను దేని గురించి చింతించడం లేదని అన్నా రు.
ఆర్థికమంత్రి చిదంబరంతో అనేక అంశాలపై చర్చించానని, అందులో భాగంగా సహజంగానే సిబిఐ తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన విషయం కూడా ప్రస్తావనకు వచ్చిందని బిర్లా అన్నారు. కాగా బిర్లాతో భేటీపై చిదంబరం వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. బొగ్గు కుంభకోణంలో సిబిఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన వ్యక్తిని ఆర్థిక మంత్రిని కలవడంపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుక చౌదరి మాత్రం బిర్లా ఓ ప్రముఖ వ్యాపారవేత్త అని ఆయన ఆర్థిక మంత్రిని కలవడంలో దాపరికం ఏముందని ప్రశ్నించారు.
ఇది ఇలా ఉండగా బొగ్గు గనుల కేసులో కుమార్ మంగళం బిర్లాను, బొగ్గు గనుల శాఖ మాజీ కార్యదర్శి పిసి పరేఖ్‌ను ఇరికించడాన్ని వ్యతిరేకిస్తూ పారిశ్రామిక రంగంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఒక సంస్థ, లేదా వ్యక్తి సమాజంలో పేరు ప్రతిష్టలను కూడగట్టుకోవడానికి ఏళ్లు పడుతుందని అందువల్ల ఏదైనా చర్యకు ఉపక్రమించేప్పుడు అత్యంత జాగ్రత్తగా అడుగుముందుకు వేయాలని సిఐఐ అధ్యక్షుడు క్రిస్ గోపాలకృష్ణ సిబిఐకి సూచించారు.


Click it and Unblock the Notifications