
నిలిచిపోయిన ఎన్నో ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించే దిశగా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని, వీటి మూలంగా నాలుగో త్రైమాసికంలో పెట్టుబడులు పుంజుకునే అవకాశం ఉందని తెలిపింది. పబ్లిక్, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు ఆశించిన స్థాయిలో పెరిగితేనే ఆర్థిక వృద్ధి మళ్లీ పట్టాలపైకి చేరుకుంటుందని మూడీస్ సీనియర్ ఆర్థికవేత్త గ్లేన్ లెవయిన్ వెల్లడించారు.
గత ఏడాది పెద్దగా మార్పులేకుండా కనిపించిన పెట్టుబడుల్లో ఈ ఏడాదిలో ఇది 3.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో 8 శాతం మేర స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు సాధించే అవకాశాలు ఎంత మాత్రం లేవని 2015 ప్రధమార్థం నాటికి ఈ వృద్ధి రేటు 6.5 శాతానికి చేరుకునే అవకాశం ఉందని మూడీస్ సంస్థ స్పష్టం చేసింది.
2008లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్య పరిస్థితులు ప్రబలం కావడానికి ముందు భారత ఆర్థిక వ్యవస్థ వెలిగిపోయింది, మూడేళ్ల పాటు వరుసగా 9 శాతం వృద్ధి రేటును సాధించిందని పేర్కొంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ 8, 9 శాతం మధ్య వృద్ధి రేటును సాధిస్తామన్న అంచనాలే తప్ప దాన్ని చేరుకునే పరిస్థితే కనిపించడం లేదని తెలిపింది. అయితే పరిస్థితులు కలిసిరావడం వృద్దికి దోహదం చేసే ఉత్తమ విధానాలను చేపట్టడం వంటి చర్యల ద్వారా భారత ఆర్థిక కార్యకలాపాలను ముమ్మరం చేసుకోగలుగుతుందని సంస్థ పేర్కొంది.
షట్‌డౌన్‌కు తెర: మన పరిశ్రమలకు ఊరట
వాషింగ్టన్/ముంబై: అమెరికాలో షట్‌డౌన్‌కు తెరపడడంతో భారత పరిశ్రామిక వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఇంకొంత కాలం అమెరికాలో షట్‌డౌన్ కొనసాగి ఉంటే భారత ఆర్థిక వ్యవస్థ, ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపి ఉండేదని పారిశ్రామి వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా అమెరికాలో ప్రభుత్వం ప్రకటించిన షట్‌డౌన్ రెండు వారాలు పైబడి కొనసాగడం వలన అభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగించిందని ప్రముఖ క్రెడిట్ రేటింగ్ సంస్థ స్టాండర్డ్ అండ్ పూర్ స్పష్టం చేసింది.
అంతేగాక అమెరికా దేశ ఆర్థిక వ్యవస్థకు 2,400 కోట్ల డాలర్లకు పైగా నష్టాన్ని మిగిల్చిందని ఒక ప్రకటనలో పేర్కొంది. షట్‌డౌన్ వల్ల నెలకొన్న ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు వీలుగా నూతన బడ్జెట్‌ను ఆమోదించడం, రుణ పరిమితిని పెంపొందించుకోవడంపై అమెరికా పార్లమెంట్‌లో అధికార, విపక్షాలు బుధవారం రాత్రి తాత్కాలికంగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం విదితమే. అయితే షట్‌డౌన్ ప్రభావం వలన నాలుగో త్రైమాసికంలో ఆర్థిక వృద్ధిరేటు 0.6 శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని స్టాండర్డ్ అండ్ పూర్ పేర్కొంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications