భారత్‌లో 2018 నాటికి 3లక్షలమంది కుబేరులు

క్రెడిట్ సూసీ రూపొందించిన నాలుగో వార్షిక ప్రపంచ సంపద నివేదిక 2013లో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
2000 సంవత్సరం నుంచి భారతదేశంలో సంపద గణనీయంగా పెరుగుతోందని క్రెడిట్ సూసీ ఇండియా ఈక్విటీ రిసెర్చ్ అధిపతి తోరల్ మున్షి తెలిపారు. కొంతమేర కరెన్సీ పతనం వంటి ఒడిదుడులు ఎదురైనప్పటికీ ఒక్కొక్కరి సంపద వార్షికంగా సగటున 8శాతం మేర పెరిగిందని చెప్పారు.
2000 సంవత్సరంలో తలసరి వ్యక్తి సంపద 2వేల డాలర్లు ఉండగా.. 2013 నాటికి 4,700 డాలర్లకు పెరిగినట్లు చెప్పారు. అంటే సగటను సంపద వార్షిక వృద్ధి రేటు 8శాతంగా ఉంది. అయితే.. ఈ కాలంలో వయోజనులు 35శాతం పెరగడం వల్ల మొత్తం సంపద మూడింతలైంది. 2012 మధ్య కాలంతో పోలిస్తే 2013 మధ్య నాటికి భారత్‌లో గృహస్థుల సంపద 7.4 శాతం పెరిగి 3.6 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. తలసరి సంపద ఏడాదికి 9.3 శాతం చొప్పున వృద్ధి చెందుతూ.. 2018 నాటికి 6,600 డాలర్లకు చేరగలదని క్రెడిట్ సూసీ అంచనా వేసింది.
దేశీయంగా కేవలం 0.4 శాతం మంది జనాభా వద్ద మాత్రమే లక్ష డాలర్లపైన సంపద ఉన్నట్లు తెలిపింది. సంఖ్యాపరంగా చూస్తే 28లక్షల మంది జనాభాగా పేర్కొంది. భారత్‌లో సంపద పెరుగుతున్నప్పటికీ ప్రతి ఒక్కరి సంపద పెరగడం లేదని, ఇప్పటికీ అధిక భాగం ప్రజలు పేదరికంలోనే ఉన్నారని తెలిపింది. 94 శాతం జనాభా సంపద 10వేల డాలర్ల కంటే తక్కువగానే ఉందని పేర్కొంది. 10 కోట్ల డాలర్ల పైబడిన అత్యంత సంపన్నుల సంఖ్య 77గా ఉండగా, 5 కోట్ల డాలర్ల పైబడిన సంపద కలవారి సంఖ్య 1,760గా ఉందని తెలిపింది.


Click it and Unblock the Notifications