
ప్రయాణ చార్జీల్లో ఇతర విమానయాన సంస్థలతో పోటీ పడుతూనే సౌకర్యవంతమైన సేవలను ద్వితీయ, తృతీయ స్థాయి నగరాల ప్రజలకు అందించడమే తమ లక్ష్యమని లింగమనేని రమేష్ చెప్పారు. 70లోపు సీట్లతో విరామం లేకుండా 4గంటల సేపు ప్రయాణించే ఇ 170 విమానాలు 2, ఇ 190 విమానాలు మరో రెండింటిని ఎంబ్రాయర్ నుంచి సమకూర్చుకున్నామని తెలిపారు.
నవంబరులో 112 సీట్ల ఇ 190 విమానాలు 2 అదనంగా చేరతాయన్నారు. ఇప్పటికి రూ. 250 కోట్ల పెట్టుబడి పెట్టామని రాబోయే రెండేళ్లలో విమానయాన రంగంపై 100 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 620కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళిక వేసినట్లు తెలిపారు. 2014కు విమాన ప్రయాణికుల సంఖ్య 7 కోట్లకు చేరే అవకాశం ఉందని, ఉజ్వల భవిష్యత్ ఉందనే అంచనాతోనే ఈ రంగంలోకి ప్రవేశించామని ఎల్ఇపిఎల్ ఫైనాన్స్ డైరెక్టర్ సిహెచ్ చౌదరి చెప్పారు.
తొలి దశలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, జైపూర్, అహ్మదాబాద్‌లకు విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మధురై, విశాఖపట్నం, గోవా, త్రివేండ్రం, మైసూర్, పుణె నగరాలకు సర్వీసులను విస్తరించనున్నట్లు లింగమనేని పేర్కొన్నారు. అంతేకాకుండా దశలవారీగా కార్యకలాపాలను విస్తరించుకుంటూ 2014 చివరినాటికల్లా మొత్తం 10 ఇ- 190 జెట్‌లను చేర్చుకోవటమే కాకుండా 2018 నాటికల్లా విమానాల సంఖ్యను 25కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు.
ఎయిర్ కోస్టాకు విజయవాడ ప్రధాన కేంద్రంగా ఉండనుండగా చెన్నై మెయింటెనెన్స్ సెంటర్‌గా ఉంటుందని పేర్కొన్నారు. విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎంబ్రార్ విమానాల కోసం ఆసియాలోనే తొలిసారిగా ఎంఆర్ఓ (నిర్వహణ, మరమ్మత్తు, ఓవర్‌హాల్) సెంటర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చౌదరి తెలిపారు. అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా ఎయిర్ కోస్టా టికెట్ ధరలు 3,000 రూపాయల నుంచి ప్రారంభమవుతాయని ఆయ చెప్పారు.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications