
ప్రభుత్వ బ్యాంకుల్లో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) బాధ్యతలను ఒకరే నిర్వహిస్తారు. అయితే ఎస్ బిఐలో మాత్రం ఛైర్మన్, నలుగురు ఎండీలు ఉంటారు. తాజాగా ఎండీ నుంచి ఛైర్ పర్సన్‌గా అరుంధతీ భట్టాచార్య పదోన్నతి పొందినందున ఒక ఎండీ పోస్టు ఖాళీ అయింది. కాగా ఎస్‌బిఐ చైర్మన్‌గా ఉన్న ప్రతీప్ చౌధురి సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందె.
1977 సంవత్సరంలో ఎస్‌బిఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా అరుంధతీ భట్టాచార్య కెరీర్‌ను ప్రారంభించారు. 36ఏళ్ల ఉద్యోగ జీవితంలో రిటైల్, ట్రెజరీ, కార్పొరేట్ ఫైనాన్స్ వంటి విభాగాల్లో ఆమె పనిచేశారు. డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, కార్పొరేట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, బెంగళూరులో చీఫ్ జనరల్ మేనేజర్‌గా, ఎస్‌బిఐ క్యాప్స్ సారథిగా భట్టాచార్య బాధ్యతలు నిర్వహించారు.
ప్రత్యేకంగా మహిళా బ్యాంకులను ప్రారంభించాలని ప్రభుత్వం పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఎస్‌బిఐ సారధిగా భట్టాచార్య నియామకం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే ప్రభుత్వరంగంలోని అలహాబాద్ బ్యాంకు (శుభలక్ష్మి పన్సే), బ్యాంక్ ఆఫ్ ఇండియా (విఆర్ అయ్యర్), ప్రైవేటు రంగంలోని ఐసిఐసిఐ బ్యాంకు (చందాకొచ్చార్), యాక్సిస్ బ్యాంకు ( శిఖా శర్మ), హెచ్ఎస్‌బిసి ఇండియా (నైనాలాల్ కిద్వాయ్) బ్యాంకులు మహిళల సారధ్యంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications