
ప్రభుత్వంపై ఉన్న తమ ద్వేషాన్ని అమెరికన్ పౌరుల సంక్షేమంపై చూపిస్తున్నారని రిపబ్లికన్లపై ఒబామా మండిపడ్డారు. పౌరుల ఆరోగ్యం పట్ల బాధ్యత లేకుండా ప్రభుత్వాన్ని నడిపించేందుకు సహకరించకపోవడం ప్రతిపక్ష పార్టీ బాధ్యత రాహిత్యమేనని అన్నారు. ప్రతిపక్ష పార్టీ తీరు సరిగా లేదని తన తర్వాత వచ్చే ఏ ప్రధాని కూడా ఇంతకంటే ఎక్కువ చేయలేరని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశం సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని స్థిరంగా నడిపిస్తున్నామని, ఇప్పటికే పౌరులందరు సంక్షోభంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. వ్యాపార వర్గాలు కూడా అదే తీరుగా ఉన్నాయని అన్నారు. జివోపి చర్చల్లో భాగస్వామ్య పక్షాలు సమస్యను జఠిలం చేస్తున్నాయని, దీంతో నాయకత్వం ఏమి చేయలేకపోతోందని అన్నారు.
స్టాక్ మార్కెట్ల సామర్థ్యం ఆధారంగా నిర్ణయం తీసుకోలేమని, అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిణామాలు దేశ ఆర్థిక పరిస్థితులపై తీవ్ర చూపే అవకాశం ఉందని వాల్ స్ట్రీట్ వర్గాలు గుర్తించాలని అన్నారు. ఫెడ్ ఛైర్మన్‌గా ఉన్న బెన్ బెర్నకె తన విధులు సరిగా నిర్వహిస్తున్నారని, ద్రవ్యోల్బణం, ఉద్యోగిత మొదలైన అంశాలపై దృష్టిసారించాల్సి ఉందని ఆయన అన్నారు. ఒబామా కేర్ బిల్లు మెజార్టీ ప్రజలు మద్దతు తెలిపే అవకాశం ఉందని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications