
ఢిల్లీలో ఆర్థిక మంత్రి పి చిదంబరం, ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్, కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారాం మధ్య గురువారం జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వాటా మూలధనాన్ని పెంచడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులకు రూ. 14 వేల కోట్లు ఇవ్వాలని బడ్జెట్‌లో నిర్ణయించారు. నిర్ణీత మొత్తం కన్నా ఎక్కువ మూలధనం నిధులు లభిస్తే.. మరిన్ని రుణాలు ఇవ్వడానికి బ్యాంకులకు అవకాశం ఉంటుంది.
బ్యాంకులకు కేటాయించే అదనపు నిధులు వృద్ధి మాంద్యాన్ని ఎదుర్కోవడానికి, ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ఇది వినియోగదారులకు ముఖ్యంగా మధ్యతరగతి వారికి ఊరట కల్పించడంతో పాటు ఉత్పాదన సామర్థ్యం పెంపునకు, ఉత్పత్తి పెంచడానికి కూడా ఇది దోహదపడుతుందని తెలిపింది.
సుమారు గంట సేపు జరిగిన ఈ సమావేశంలో వివిధ రంగాల్లో రుణ వృద్ధిపై చర్చించారు. అయితే బ్యాంకులకు సమకూర్చే అదనపు మూలధనం ఎంత అనేది మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. 2013 సెప్టెంబర్ చివరి నాటికి స్థూలంగా బ్యాంక్ రుణాల వృద్ధి నిరుటితో పోలిస్తే 18 శాతం పెరిగింది. కొన్ని రంగాల్లో రుణ వృద్ధి మాత్రం అంతగా లేదు. దీన్ని బట్టి చూస్తే ఈ రంగాల్లో డిమాండ్ ఇప్పటికీ స్తబ్దుగా ఉందనే విషయం తెలుస్తోందని ఆర్థిక శాఖ తెలిపింది.
తాజాగా ప్రకటించిన పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలను బట్టి నిరుటి జూలై నెలలో 0.8శాతం వృద్ధిని నమోదు చేసిన కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగం ఉత్పత్తి ఈ ఏడాది అదే నెలలో 9 శాతం తగ్గింది. నిరుడు ఇదే నెలలో ఈ రంగం ఉత్పత్తి 0.8శాతం పెరిగింది. ఏప్రిల్-జులై నెలల్లో ఈ రంగ ఉత్పత్తి 12శాతం తగ్గింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో 6.1శాతం పెరిగింది. అంటే టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మిషన్లు లాంటి వాటికి డిమాండ్ తగ్గినట్లు అర్థమవుతుంది. కాగా, నిరుడు ఏప్రిల్- ఆగస్టు మధ్య కాలంలో 6.8 శాతం వృద్ధిని నమోదు చేసిన ద్విచక్ర వాహనాల రంగం ఈ ఏడాది అదే సమయంలో కేవలం నామమాత్రంగా 0. 72 శాతం వృద్ధినే నమోదు చేసింది.
గురువారం జరిగిన చర్చల ఆధారంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు సమకూర్చే మూలధనాన్ని పెంచాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందని ఆర్థిక శాఖ పేర్కొంది. శుక్రవారం రాయ్‌పూర్‌లో రిజర్వ్ బ్యాంక్ బోర్డు సమావేశం జరగడానికి ముందు బ్యాంకులకు అదనపు మూలధనాన్ని సమకూర్చాలన్న నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications