
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి వృద్ధిని దృష్టిలో ఉంచుకుని వార్షిక వృద్ధిని కూడా కుదించినట్లు బ్యాంకు తన నివేదికలో తెలిపింది. అయితే 2014-15లో వృద్ధిరేటు 5.7శాతం ఉండవచ్చునని అంచనా వేసింది. ఇది కూడా గతంలో ప్రకటించిన అంచనా 6.5శాతం కన్నా తక్కువగానే ఉండడం గమనార్హం. ప్రస్తుత మార్కెట్‌లో నెలకొని ఉన్న అనిశ్చిత పరిస్థితులు ఆర్థిక సంస్కరణల ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయని ఎడిబి ముఖ్య ఆర్థిక వేత్త చాంగ్ యంగ్ రీ పేర్కొన్నారు.
కాగా గత నెలలో ప్రధాని ఆర్థిక సలహా మండలి(పిఎంఇఎసి) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి రేటును 6.4 నుంచి 5.3శాతానికి తగ్గించింది. భారత ప్రభుత్వం వృద్ధిని రేటును పెంచేందుకు అనేక చర్యలు చేపబడుతోందని, ఇందులో భాగంగానే జపాన్‌తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 1500 కోట్ల డాలర్ల నుంచి 5వేల కోట్ల డాలర్లకు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు ఎడిబి తెలిపింది.
భారత్ స్థూల ఆర్థిక ప్రణాళికలను చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆసియా అభివృద్ధి బ్యాంకు అభిప్రాయపడింది. రూపాయి పతనం, విదేశీ నిధులు వెనక్కి మరలటం, వ్యవస్థాపరమైన ఇబ్బందులు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఎడిబి తన నివేదికలో పేర్కొంది. భారత్ తోపాటు చైనా వృద్ధి రేటు అంచనాలను కూడా ఎడిబి తగ్గించింది. నిరుడు ఏప్రిల్‌లో 8.2శాతంగా ఉన్న చైనా వృద్ధి రేటును జులైలో 7.7శాతానికి తగ్గించింది. ప్రస్తుతం 7.6శాతానికి పరిమితం చేసింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications