
మన ఆర్థిక వ్యవస్థ చాలా వేగవంతంగా, క్రియాశీలంగా ముందుకు సాగుతూ కొత్త ఆవిష్కరణలు, అవకాశాలకు ద్వారాలు తెరుస్తోందని ఆయన అన్నారు. ఈ సమయంలో కొన్ని వ్యాపారాలలో క్రమబద్ధంకాని కంపెనీలు పుట్టుకు వస్తున్నాయని ఆయన అన్నారు. అటువంటి కంపెనీల ఆర్థిక క్రమశిక్షణకు చేటు కలిగించడంతో పాటు మార్కెట్‌ను అస్థిరపరుస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి కార్యకలాపాల వల్ల మార్కెట్‌లో చాలా మంది మదుపరులు నష్టపోడంతోపాటు మార్కెట్‌పై విశ్వాసాన్ని కూడా కోల్పోతున్నారని చిదంబరం చెప్పారు.
చాలా మంది చిన్న పెట్టుబడిదారులు ఇంకా మార్కెట్‌కు దూరంగానే ఉంటున్నారని, అందువల్ల ఆర్థిక వ్యవస్థ ఆశించినంత బలోపేతం కావడం లేదని ఆయన అన్నారు. సంస్కరణలు అమలు చేస్తున్నప్పుడు ఒక్కోసారి అనుసరిస్తున్న వేగం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దాని వల్ల సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన చెప్పారు.
ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆశయాలకు తగినట్లు పనిచేస్తూ పారదర్శకతతో వ్యవస్థను, సంస్థలను కాపాడుతుందని హామీ ఇచ్చారు. ప్రపంచ మాంద్య పరిస్థితులకు తగినట్లుగా భారత్ స్పందిస్తోందని, కమోడిటీ ఫ్యూచర్ మార్కెట్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకురావడం ఇందులో భాగమేనని ఆయన అన్నారు.
రానున్న కాలంలో సంస్కరణలు బలంగా అమలు చేసేందుకు, సరళమైన, పారదర్శకమైన విధానాలు రూపొందించేందుకు గత కొంత కాలంగా మన దేశంలో సెబి, ఐఆర్‌డిఏ యాక్ట్ వంటి అనేక కొత్త చట్టాలను రూపొందించడం జరిగిందని తెలిపారు. నియంత్రాణా మార్గాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. ఇందుకోసం ఆర్థిక విభాగ న్యాయ సంస్కరణల కమిషన్ చేసిన న్యాయేతర మార్గాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని చిదంబరం తెలిపారు.


Click it and Unblock the Notifications