న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూసివేయబడిన ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రామగుండం యూరియా కర్మాగార పునరుద్ధరణకు కన్సార్టియం ఏర్పాటు చేసే అంశంపై నేషనల్ ఫెర్టిలైజర్స్ (ఎన్ఎఫ్ఎల్), ఇంజినీర్స్ ఇండియా, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ (ఎఫ్ సిఐఎల్) చర్చిస్తున్నాయి. ఈ మేరకు ఎన్ఎఫ్ఎల్ ఉన్నతాధికారులు వెల్లడించారు.

రామగుండం ప్లాంటు పునర్నిర్మాణానికి సుమారు రూ.4,700 కోట్ల పెట్టుబడి అవసరం అవుతుందని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతిపాదిత స్పెషల్ పర్సన్ వెహికిల్(ఎస్ పివి)లో ఎస్ఎఫ్ఎల్, ఐఈఎల్లు చెరి 26శాతం, ఎఫ్‌సిఐఎల్‌కు 11శాతం వాటా ఉండే అవకాశం ఉంది. వ్యూహాత్మక భాగస్వామికి మిగిలిన వాటా కేటాయించే అవకాశం ఉంది.
స్పెషల్ పర్సన్ వెహికిల్ భాగస్వామ్య సంస్థలు పెట్టుబడిలో మూడింట ఒక వంతు ఈక్విటీ మూలధనం రూపంలో సమకూర్చుతాయి. మిగిలిన మొత్తాన్ని రుణంగా సేకరిస్తామని అధికారులు తెలిపారు. సహజ వాయువు ఆధారంగా పనిచేయనున్న రామగుండం కర్మాగారం ఏడాదికి 12.70లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది. రాష్ట్రంలోని రామగుండం ప్లాంటు సహా ఎఫ్‌సిఐఎల్‌కు చెందిన ఐదు కర్మాగారాలు 2002లో మూసివేతకు లోనైన విషయం తెలిసిందె.
More From GoodReturns

టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు డబ్బులు వెనక్కి ఇచ్చేయండి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..

LPG సంక్షోభంపై చంద్రబాబు కీలక ప్రకటన.. ప్రజలు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని స్పష్టం..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications