క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగంపై ఆర్‌బిఐ సూచనలు

Reserve Bank of India
ముంబై: భారత రిజర్వు బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుల సురక్షిత వినియోగానికి తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లపై బ్యాంకులకు మార్గ నిర్దేశనం చేసింది. తాము సూచించిన జాగ్రత్తలు తీసుకునేందుకు మరికొంత సమయం కావాలన్న బ్యాంకర్ల వినతిని రిజర్వు బ్యాంకు తోసిపుచ్చింది. దీంతో ఇక నుంచి బ్యాంకులు కార్డుల సురక్షిత వినియోగానికి తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే కష్టాలు తప్పేట్టు లేవు.

వినియోగదారులు తమ ప్రమేయం లేకుండానే పాయింట్ ఆఫ్ సేల్ (పిఓఎస్) వద్ద లావాదేవీలు జరిగాయని ఫిర్యాదు చేసినట్లయితే 3 రోజుల్లోగా బ్యాంకులు పిఓఎస్‌ను పరిశీలించాల్సి ఉంటుంది. రిజర్వు బ్యాంకు సూచించిన విధంగా కార్డుల సురక్షిత వినియోగానికి ఏర్పాట్లు చేయకపోతే ఏడు పని దినాల్లోపు ఖాతాదారుకు నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఆ విధంగా చేయకపోతే 8వ రోజు నుంచి రోజుకు 100 రూపాయల చొప్పున బ్యాంకులు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ నిబంధనల అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.

ఇటీవలి కాలంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి చిన్న చిన్న వ్యాపార సంస్థల వరకు డెబిట్, క్రిడిట్ కార్డులను స్వైప్ చేసే పిఓఎస్ యంత్రాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 9.50లక్షల పిఓఎస్ యంత్రాలను వివిధ బ్యాంకులు జారీ చేసినట్లు సమాచారం. టెలిఫోన్ లైన్ ద్వారా లేదా సిమ్ కార్డు ఆధారంగా జిపిఆర్ఎస్ పద్ధతిలో పిఓఎస్ యంత్రాలను ఇంటర్నెంట్‌కు అనుసంధానం చేయడం జరుగుతుంది.

డెబిట్, క్రికెట్ కార్డులతో స్వైప్ చేసినప్పుడు ఆ వ్యవహారానికి సంబంధించిన సమాచారం ఓపెన్ సర్వర్ ద్వారా ఇతరులు సంగ్రహించే అవకాశం ఉండడంతో కార్డులోని సమాచారాన్ని పేమెంట్ గేట్ వే‌లోని సర్వర్‌కు చేరే ఏర్పాట్లు చేయాలని గతంలో రిజర్వు బ్యాంకు సూచించింది. ఆర్‌బిఐ సూచించిన విధంగా చర్యలు చేపట్టినట్లయితే ఆ సమాచారాన్ని ఎవరూ గ్రహించేందుకు వీలుపడదు. కాగా అక్టోబర్ 1నుంచి వినియోగదారుల కార్డుల లావాదేవీలకు రక్షణ కల్పించని పక్షంలో ఏవైనా తప్పులు జరిగినట్లయితే వాటికి సంబంధిత బ్యాంకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+