
సమాజానికి తిరిగి ఇవ్వడమనేది చాలా ప్రధానమైన అంశమని, అది తమ మనసుల్లోంచి రావాలని ఆయన అన్నారు. కంపెనీలు తమ లాభాల్లో 2శాతాన్ని ప్రజోపయోగ కార్యక్రమాలకు వెచ్చించాలన్న నిబంధనను భవిష్యత్ పన్ను కింద మార్చేయకూడదని అజీం ప్రేమ్‌జీ పేర్కొన్నారు. సామాజిక బాధ్యత కేవలం ప్రభుత్వానికే పరిమితం కాదని, సమాజంలో మార్పు రావాలంటే మొత్తం వ్యవస్థ కూడా ఈ ప్రక్రియలో పాలుపంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అందిస్తేనే మంచి సమాచాన్ని చూడొచ్చని అభిప్రాయపడ్డారు. సిఎస్ఆర్‌కు, వ్యక్తిగత దాతృత్వానికి మధ్య భేదం ఉండాల్సిన అవసరం ఉందని, వ్యక్తిగత దాతృత్వానికి సిఎస్ఆర్ ప్రత్యామ్నాయం కాదని ఆయన అన్నారు. కొత్త కంపెనీల చట్టం-2013 ప్రకారం లాభాల్లో ఉన్న కంపెనీలన్నీ ప్రతీయేటా మూడేళ్ల సగటు లాభాల్లో 2శాతం మేర సిఎస్ఆర్ కింద వెచ్చించాల్సి ఉంటుంది.
కాగా 2010 సంవత్సరంలో ప్రేమ్‌జీ తనకు విప్రోలో ఉన్న వాటాలో 8.7శాతం వాటాను అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందె. గత ఫిబ్రవరిలోనూ తన నియంత్రణలో ఉన్న సంస్థల నుంచి 12,300 కోట్ల రూపాయల విలువైన 29.55 కోట్ల షేర్లను ఒక ట్రస్టుకు మళ్లిస్తున్నట్లు అజీం ప్రేమ్ జీ ప్రకటించారు.


Click it and Unblock the Notifications