సచిన్, ధోనీ, షారుక్, సల్మాన్ ఖాతాలూ హ్యాక్!
ముంబై: ఇటీవల ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం అనీల్ అంబానీకి సంబంధించి ఆదాయపు పన్నుఖాతా వివరాలను హ్యాక్ చేయడంతో హైదరాబాద్‌కు చెందిన సిఏ విద్యార్థినిని పోలీసులు అరెస్ట్ విషయం తెలిసిందె. కాగా తమ విచారణలో మరికొందరు ప్రముఖుల ఆదాయపు పన్ను ఖాతాలు కూడా హ్యాకింగ్‌కు గురైనట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, ప్రముఖ సినీ నటులు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌ల ఆదాయపు పన్ను ఖాతాలు హ్యాకింగ్‌కు గురైనట్లు తెలిసింది. అయితే వీరి ఖాతాలను నోయిడాకు చెందిన మరో సిఏ విద్యార్థి హ్యాక్ చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు సైబర్ నేరాల విభాగం పోలీసులు తెలిపారు.

హైదరాబాద్‌లోని మనోజ్ దాగా అండ్ కంపెనీలో ఆర్టికల్ షిప్ చేస్తున్న సిఏ విద్యార్థినిని నోయిడాలో జరిగిన హ్యాకింగ్ గురించి ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు. అయితే తనకు నోయిడాలో ఎవరూ తెలియదని, ఆ హ్యాకింగ్‌తో కూడా తనకు సంబంధం లేదని చెప్పినట్లు సైబర్ నేరాల విభాగం అధికారి ముకుంద్ పవార్ తెలిపారు. విద్యార్థినిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
తమ దర్యాప్తులో నోయిడాకు చెందిన సిఎ విద్యార్థి ఈ హ్యాకింగ్‌కు పాల్పడినట్లు తేలిందని ఆయన తెలిపారు. నోయిడాలోని విశాల్ కుషాల్ కంపెనీలో ఆర్టికల్ షిప్ చేస్తున్న సిఏ విద్యార్థి సంచిత్ కుటియాల.. వ్యాపార వేత్త అనీల్ అంబానీ ఆదాయపు పన్ను ఖాతాను హ్యాక్ చేసినట్లు గుర్తించినట్లు చెప్పారు. సెప్టెంబర్ 16న సంచిత్ పై కేసు నమోదు చేసి కంప్యూటర్, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
జూన్ 22న సినీ నటుడు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఖాతాలను, జూన్ 24న మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాను, జూన్ 26న అనీల్ అంబానీ ఖాతాను, జూన్ 28న మళ్లీ ధోనీ ఖాతాను, జులై 4న సచిన్ టెండూల్కర్ ఆదాయపు పన్ను ఖాతాలను హ్యాక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ప్రముఖుల ఆదాయ వివరాలను తెలుసుకోవాలనే ఆసక్తితోనే సిఏ విద్యార్థులు హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications