భారీ నష్టాలతో కుదేలవుతున్న కెనడాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ బ్లాక్‌బెర్రీ లిమిటెడ్‌ను కొనుగోలు చేసేందుకు ఓ హైదరాబాదీ ముందుకు వచ్చారు. కెనడాలోని ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ సంస్థ చైర్మన్, సీఈవో ప్రేమ్ వత్స..బ్లాక్‌బెర్రీ కంపెనీని సుమారు రూ. 30 వేల కోట్లతో కొనుగోలు చేసేందుకు ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్నారు.
బ్లాక్‌బెర్రీ కంపెనీలో ఫెయిర్ ఫాక్స్ కంపెనీకి 10శాతం వాటా ఉంది. ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ నాయకత్వంలోని కన్సర్టియమ్ ఆఫ్ ఇన్వెస్టర్లకు 4.7 బిలియన్ డాలర్లు అంటే సుమారు 30వేల కోట్ల రూపాయలతో తమ కంపెనీని విక్రయించేందుకు ఎల్ఓఐపై సంతకాలు చేసినట్లు బ్లాక్‌బెర్రీ కంపెనీ తెలిపింది.

హైదరాబాద్ నగరానికి చెందిన ప్రేమ్ వత్స కెనడా వారెన్ బఫెట్‌గా పేరుపొందారు. వారెన్ బఫెట్ తరహాలోనే పెట్టుబడి విధానాలను అనుసరించడం వల్లే ప్రేమ్ వత్సను కెనడా బఫెట్‌గా పిలుచుకుంటున్నారు. వారెన్ బఫెట్‌లానే ప్రేమ్ వత్స కూడా నష్టాల్లో ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. 1950లో హైదరాబాద్‌లో జన్మించిన ప్రేమ్ వత్స బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు. మద్రాస్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత తర్వాత కెనడాకి వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఒంటారియోలో ఎంబీయే చేశారు.
కెనాడలో 1985లో ఫెయిర్‌ఫ్యాక్స్ సంస్థను ప్రేమ్ వత్స ప్రారంభించారు. కెనడాలోని టొరంటో ప్రధాన కేంద్రం పనిచేస్తున్న ఫెయిర్ ఫ్యాక్స్ ఆస్తులు, క్యాజువాల్టీ ఇన్స్యూరెన్స్, జీవిత బీమా, రీ-ఇన్య్సూరెన్స్, పెట్టుబడుల నిర్వహణ, బీమా క్లెయిమ్‌ల నిర్వహణ మొదలగుకార్యకలాపాలను నిర్వహిస్తోంది.
కెనడాలో కూడా హౌసింగ్ మార్కెట్ విలువ ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉందని కూడా ఆయనే వెల్లడించారు. అందరూ వీటిని కొట్టిపారేసి హౌసింగ్ మార్కెట్‌లలో విపరీతమైన లాభాలు ఆర్జిస్తున్నప్పుడు 2003-2006 మధ్యలో ఫెయిర్‌ఫాక్స్ స్టాక్ విలువ 50 శాతం పైగా పడిపోయింది. కానీ ఆ తర్వాత 2007 నుంచి మిగతా ఇన్వెస్టర్లు నష్టాల్లో కూరుకుపోతున్నప్పుడు ఫెయిర్‌ఫాక్స్ బిలియన్ డాలర్ల స్థాయిలో లాభాలు ఆర్జించింది. ఆ నిధులను వత్స క్రమంగా ఈక్విటీల్లోకి మళ్లించి 2006లో కనిష్టమైన 100 కెనడియన్ డాలర్ల స్థాయికి పడిపోయిన ఫెయిర్‌ఫ్యాక్స్ షేర్లు ప్రస్తుతం నాలుగింతలు పెరిగాయి.
1990లో టోక్యో మార్కెట్ కుప్పకూలడానికి చాలా ముందుగానే పరిస్థితులను పసిగట్టిన వత్స.. పెట్టుబడులు పెట్టి భారీ లాభాలు ఆర్జించారు. ఇక, బ్లాక్‌బెర్రీ షేర్లు అంతకంతకూ పతనమవుతున్నప్పటికీ ఫెయిర్‌ఫ్యాక్స్ తన వాటాను 2% నుంచి 10%కి పెంచుకుంది. ఇప్పటికే బ్లాక్‌బెర్రీలో మూడో అతి పెద్ద ఇన్వెస్టరుగా ఫెయిర్‌ఫ్యాక్స్ ఉంది. ప్రేమ్ వత్స సారథ్యంలోని ఫెయిర్‌ఫ్యాక్స్ భారత కంపెనీలతో కూడా జట్టు కట్టింది.
1999లో ఐసీఐసీఐ బ్యాంక్, ఫెయిర్‌ఫాక్స్ కలిసి ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థను ఏర్పాటు చేశాయి. ఫెయిర్‌ఫాక్స్ గతేడాది బ్రిటన్ కంపెనీ థామస్ కుక్ భారత విభాగంలో 77 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ థామస్ కుక్ ఇండియా ఈ ఏడాది మేలో ఐక్య హ్యూమన్ క్యాపిటల్ సొల్యూషన్స్ అనే సంస్థలో 77.3 శాతం వాటాలను సుమారు రూ. 256 కోట్లకు కొనుగోలు చేసింది.
నిరుడు ఫెయిర్‌ఫ్యాక్స్ లండన్‌కి చెందిన బ్రిట్ ఇన్సూరెన్స్‌ని 300 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. 2010లో జెనిత్ నేషనల్ ఇన్సూరెన్స్‌ని 1.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ప్రేమ్ వత్స రిచర్డ్ ఐవీ స్కూల్ ఆఫ్ బిజినెస్ అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగా, యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూకి ఛాన్స్‌లర్‌గానూ వహరిస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications