
67 మండలాలు, 849 గ్రామాలతో హెచ్‌ఎండిఏను ఆరేళ్ల క్రితం రాష్ట్రప్రభుత్వం చట్టబద్ధంగా ఏర్పాటు చేసింది. తాజాగా మాదాపూర్, గచ్చిబౌలీ, శంషాబాద్ వద్ద రెండు కోట్ల రూపాయల పెట్టుబడితో కేంద్రం ఐటి పెట్టుబడుల ప్రాంతాన్ని ప్రకటించిన విషయమే.
వచ్చే 10 సంవత్సరాల్లో రాజధాని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నగరానికి అన్ని వైపులా శాటిలైట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే గత ఏడాది హెచ్‌ఎండిఏ రూపొందించిన బృహత్‌ప్రణాళికలో 46 అర్బన్ నోడల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. తాజాగా మరో 13 అర్బన్ నోడల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండిఏ ప్రతిపాదించింది.
ఈ నోడల్ సెంటర్లను ఏర్పాటు చేయాలంటే అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది. రోడ్డు, రవాణా సదుపాయాలు, ఇండ్ల నిర్మాణానికి అనుమతులు శరవేగంగా మంజూరు చేయాల్సి ఉంటుంది. బెంగళూరు, విజయవాడ, గుంటూరు, నాగపూర్ తదితర రహదారుల్లో నోడ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు హెచ్‌ఎండిఏ అధ్యయనాలను చేపట్టింది.


Click it and Unblock the Notifications