
ఇంతకు ముందు మొదటి స్థానంలో ఉన్న జిందాల్ స్టీల్ అధిపతి నవీన్ జిందాల్‌ను వెనక్కినెట్టి కళానిధి మారన్, కావేరీలు అగ్రస్థానాన్ని ఆక్రమించారు. అయితే ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఫలితంగా 2011-12తో పోలిస్తే 2012-13 ఆర్థిక సంవత్సరానికి వీరి ముగ్గురి పారితోషికంలో కోత పడింది. జిందాల్ పారితోషికంలో ఏకంగా 25 శాతం మేర తగ్గింది. 2011-12లో నవీన్ జిందాల్ ప్యాకేజీ రూ.73.42 కోట్లు ఉండగా..2012-13కి 25 రూ.54.98 కోట్లకు పరిమితమైంది.
మారన్ దంపతుల పారితోషికం 2011-12తో పోల్చితే 2012-13 ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా ఒక శాతం కోతపడింది. గతనాలుగేళ్ల కాలంలో అధిక పారితోషికం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌ల జాబితాలో మారన్ దంపతులు లేదా జిందాల్ ఉండడం విశేషం. 2009-10, 2012-13సంవత్సరాల్లో మారన్ దంపతులకు మొదటి స్థానం లభిస్తే.. 2010-11, 2011-12లో జిందాల్ తొలి స్థానంలో ఉన్నారు.
ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా రూ.49.62 కోట్ల పారితోషికం తీసుకుంటూ నాలుగో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో హీరో మోటో కార్ప్‌నకు చెందిన బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ (రూ.32.72 కోట్లు), పవన్ ముంజాల్ (రూ.32.80 కోట్లు), సునిల్‌కాంత్ ముంజాల్ (రూ.31.51 కోట్లు) ఉన్నారు. పారిశ్రామిక దిగ్గజాలైన ముఖేష్, అనిల్ అంబానీ బ్రదర్స్, అజీమ్ ప్రేమ్‌జీ, ఆనంద్ మహీంద్రా, సునిల్ మిట్టల్‌లకు టాప్ 10 జాబితాలో స్థానం లేకపోవడం గమనార్హం.
మిట్టల్ 24.33 కోట్ల రూపాయల వేతనంతో 11వ స్థానంలో ఉన్నారు. అమర రాజా బ్యాటరీస్‌కు చెందిన జయ్‌దేవ్ గల్లా 24.33 కోట్ల రూపాయలతో 12వ స్థానంలో నిలిచారు. ఒకప్పుడు దేశంలో అత్యధిక ప్యాకేజీ అందుకున్న ముకేష్ అంబానీ ఇప్పుడు 15 కోట్ల రూపాయలతో 16వ స్థానంలో ఉన్నారు. ఎనిమిదో స్థానంలో రామ్‌కో సిమెంట్స్ సారధి పిఆర్ఆర్ రాజా (రూ.30.96 కోట్లు), తొమ్మిదో స్థానంలో మారుతిసుజుకీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ షింజో నకనిషి (రూ.30.90 కోట్లు), దివీస్ లాబ్స్ చైర్మన్ మురళీ రూ. 26.46 కోట్ల పారితోషికంతో పదో స్థానంలో నిలిచారు.


Click it and Unblock the Notifications