హైదరాబాద్‌కు మరో ఐటి హబ్
హైదరాబాద్: నగరంలో మరో భారీ ఐటి హబ్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.2.19లక్షల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో ఐటి హబ్ ఏర్పాటుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం(ఐటీఐఆర్)గా హైదరాబాద్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం తెలిపారు.
ఐటిఐఆర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలపడం పట్ల పొన్నాల లక్ష్మయ్య హర్షం వ్యక్తం చేశారు. ఐటిఐఆర్‌లో ఉత్పాదక యూనిట్లు, లాజిస్టిక్స్, పబ్లిక్ యుటిలిటీస్, పర్యావరణ పరిరక్షణ, గృహ సముదాయాలు ఏర్పాటయ్యే అవకాశముంది.

ఈ ప్రాజెక్టులో ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పారిశ్రామిక పార్కులు, వాణిజ్య ప్రాంతాలు, గిడ్డంగులు, ఎగుమతి యూనిట్లు మొదలైన వాటిని కూడా ఏర్పాటు చేసే అవకాశముంది. ఐటిఐఆర్ ప్రాజెక్టు ద్వారా 30వేల 170కోట్ల రూపాయల మేర రాష్ట్రానికి అదనంగా పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతుందని పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. కాగా దేశ ఐటి ఎగుమతుల్లో 12.4శాతం వాటాతో రాష్ట్రం 4వ స్థానంలో నిలిచింది. 2011-12లో రాష్ట్రం నుంచి ఐటీ సేవల ద్వారా రూ.53,246 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది.
ఈ ప్రాజెక్టు వల్ల రాబోయే 25ఏళ్లలో రూ. 3లక్షల 10వేల 849 కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతాయని ఆయన చెప్పారు. దీని ద్వారా సుమారు 15లక్షల మంది యువతకు ప్రత్యక్షంగా, 53లక్షల మందికి పరోక్షంగానూ ఉపాధి లభించగలదని అన్నారు.


Click it and Unblock the Notifications