
ఈ కేసులో తాజాగా ప్రొసీడింగ్స్‌ను చేపట్టాలంటూ ఈ నెల 13న అప్పీల్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సత్యం కంప్యూటర్స్ ఆర్థికపరమైన వివరాలను వెల్లడించకుండా మోసపూరితంగా తమను ప్రేరేపించి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయించిందని విజిఇ, లారీ జె వింగెట్ ట్రస్ట్ తమ పిటిషన్‌లో ఆరోపించాయి. మరోవైపు 2005లోనే విజిఇ క్లెయిమ్స్‌కు సంబంధించి ఆర్బిట్రే షన్‌కు వెళ్లగా దీన్ని కొట్టివేసారని సత్యం వాదించింది.
అంతేకాకుండా విజిఇకి ఉన్న సగం వాటాను సత్యం వెంచర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఎస్‌విఇఎస్)కు సత్యం కంప్యూటర్స్‌కు బదలాయించాలని ఆదేశించిందని తెలిపింది. ఆ సమయంలో ఈ ఉత్తర్వులకు విజిఇ కట్టుబడి ఉందని కూడా సత్యం తెలిపింది.2009లో మోసానికి పాల్పడినట్లు సత్యం కంప్యూటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ రామలింగరాజు ఇన్వెస్టర్లకు తెలియజేయటంతో 2010 డిసెంబర్‌లో సత్యంపై విజిఇ ఇన్‌స్టంట్ యాక్షన్ కేసును దాఖలు చేసింది.
సత్యం ఉద్దేశపూర్వకంగానే తప్పు చేసిందని విజిఇ, ట్రస్ట్ చేసిన వాదనలను పట్టించుకోకుండా ప్రతివాదులకు ఎలా మేలు చేకూర్చారంటూ డిస్ట్రిక్ట్ కోర్టును అప్పీల్స్ కోర్టు తప్పుబట్టింది. డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కు తీసుకోవటమే కాకుండా మరింత లోతుగా విచారణ చేపట్టాలంటూ యుస్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ తీర్పునిచ్చింది. ఆటో పరిశ్రమకు సంబంధించి ఇంజనీరింగ్ సర్వీసులను అం దించేందుకు గాను జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయాలంటూ ట్రస్ట్ యాజమాన్యంలోని వెంచర్ ఇండస్ట్రీస్ ఆస్ట్రేలియాను సత్యం సంప్రదించిందని కోర్టు డాక్యుమెంట్లు వెల్లడిస్తున్నాయి.
గ్లోబల్ ఐటి కంపెనీగా ఉన్న తమతో చేతులు కలపటం ద్వారా కంపెనీకి మరింత ప్రాచుర్యం లభిస్తుందని ట్రస్ట్‌కు సత్యం సూచించింది. దీంతో 2000 సంవత్సరంలో ట్రస్ట్ సొంతంగా సంస్థను ఏర్పాటు చేయటమే కాకుండా అనంతరం సత్యంతో కలిసి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. 2005లో జాయింట్ వెంచర్ నుంచి విజిఇ తప్పుకుంది.


Click it and Unblock the Notifications