హైదరాబాద్: భీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ(ఐఆర్డీఏ) ఇన్స్యూరెన్స్ రెపోసిటరీ సిస్టమ్(ఐఆర్‌ఎస్) ను కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐఆర్ఎస్ త్వరలో నాన్ లైఫ్ ఇన్య్సూరెన్స్ పాలసీలను కూడా డిజిటలైజ్ చేస్తుందని ఆయన చెప్పారు.
ఇన్స్యూరెన్స్ రెపోసిటరీ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి నియంత్రణ చేయడమనేది ప్రపంచంలో ఇదే మొదటసారని ఐఆర్డీఏ తెలిపింది. ఐఆర్డీఏ ఇటీవల తెలిపిన వివరాల ప్రకారం ఐదు కంపెనీల ఇన్స్యూరెన్స్ రెపోసిటరీలు, లైసెన్సులు జులై 31, 2014 వరకు అమలులో ఉంటాయి. ఆ ఐదు కంపెనీలలో ఎన్ఎస్‌డీఎల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్, సెంట్రల్ ఇన్స్యూరెన్స్ రెపోసిటరీ లిమిటెడ్, ఎస్‌హెచ్‌సీఐఎల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, సీఏఎంఎస్ రెపోసిటరీ సర్వీసెస్ లిమిటెడ్, కార్వీ ఇన్స్యూరెన్స్ రెపోసిటరీ లిమిటెడ్‌లు ఉన్నాయి.

ఐఆర్డీఏ ఇటీవల చెప్పిన వివరాల ప్రకారం.. ఇన్స్యూరర్స్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రెపోసిటరీలతో ఒప్పందాల్లో ప్రవేశించవచ్చు. ఇన్స్యూరెన్స్ పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో భద్ర పరిచే సౌకర్యాన్ని పాలసీదారులకు ఇన్స్యూరెన్స్ రెపోసిటరీ కల్పించాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరిచిన పాలసీలను తొందరగా మార్చుకోవడానికి అనువుగా ఉంటాయి. పాలసీల మార్పు, జాప్యాన్ని నివారించడం, ఖచ్ఛితత్వం, పూర్తి సామర్థ్యంతో పనిచేయడం, ఖర్చులను తగ్గించడమనేవి పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో భద్ర పర్చడం ద్వారా సాధ్యమవుతుంది.
పాలసీదారుకు రెపోసిటరీ ఒక వ్యక్తిగత నెంబరు జారీ చేస్తుంది. ఆ నెంబరు కిందే పాలసీదారు కలిగి ఉన్న పాలసీలన్నీ ఉంటాయి. ఆ నెంబర్ ద్వారా పాలసీకి సంబంధించిన వివరాలు, క్లెయిమ్, నామినీ, పాలసీ ప్రయోజనాలు, ఇతర వివరాలు పాలసీదారు తెలుసుకోవచ్చు.
కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిదంబరంతో భేటీ అయ్యారు. చిదంబరంతో ముఖ్యమంత్రి శంషాబాద్ విమానాశ్రంయంలో సమావేశమయ్యారు.


Click it and Unblock the Notifications