
దాదాపు రెండునెలలపాటు కొనసాగిన తిరోగమనానికి స్వస్తి పలుకుతూ ఐఐపి సూచీ కోలుకోవడం పారిశ్రామిక, వాణిజ్యరంగాల్లో ఉత్సాహాన్ని కలిగించింది. ఆర్‌బీఐ, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే ఈ ఉత్సాహం కొనసాగే అవకాశాలుంటాయని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి.
గత కొన్ని నెలలుగా నిరుత్సాహంగా ఉన్న పారిశ్రామిక రంగం పనితీరు జులైలో ఒక్కసారిగా పుంజుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ జులైలో పారిశ్రామిక ఉత్పత్తుల సూచి (ఐఐపి) 2.6 శాతం వరకు పెరిగింది. మే, జూన్ రెండు నెలల్లోనూ పారిశ్రామిక ఉత్పత్తుల రంగంలో తిరోగమనంలోనే ఉంది. అయితే జులైలో కూడా పారిశ్రామిక ఉత్పత్తుల రంగంలో 0.5 శాతం మేర తిరోగమనంలోనే ఉంటుందన్న అంచనాలు వెలువడ్డాయి. కాగా అనూహ్యంగా పెరుగుదల నమోదు చేయడం పారిశ్రామిక వర్గాలకు కొంత మేర ఊరట లభించినట్లు చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందన్న ఆశలు మరింత పెరుగుతున్నాయి. గత కొంతకాలంగా డిమాండ్ మందగించిన కారణంగా పారిశ్రామిక రంగం బలహీనంగా మారింది. మరోవైపు అనుమతిలో జాప్యం కారణంగా వేల కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టులు ఆగిపోయాయి. వడ్డీ రేట్లు పెరగడం, ఊహించిన విధంగా ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయకపోవడంతో పెట్టుబడులు పెట్టే వాతావరణం పూర్తిగా కుదేలైందని చెప్పవచ్చు.
జులైలో పారిశ్రామిక ఉత్పత్తుల్లో పెరుగుదల, విద్యుత్ ఉత్పత్తి మెరుగ్గా ఉండటం ఐఐపి గణాంకాలను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ఐఐపిలో 75 శాతం వాటా ఉన్న పారిశ్రామిక ఉత్పత్తుల విభాగం జులైలో 3 శాతం వరకు వృద్ధి సాధించింది. క్యాపిటల్ గూడ్స్ విభాగం గత ఏడాది జులైలో 5.8 శాతం తిరోగమనంలో ఉండగా ఈ జులైలో 15.6 శాతం పురోగతి సాధించింది. మైనింగ్ రంగం మాత్రం జులైలోనూ 2.3 శాతం మేర తగ్గింది. అయితే మొత్తం 22 పారిశ్రామిక విభాగాల్లో 11 రంగాలు సానుకూలంగా ఉండడం పారిశ్రామిక వర్గాలకు మంచి సంకేతంగా చెప్పవచ్చు.
ప్రభుత్వ వివరాల ప్రకారం..ఆహారం, పానీయాల విభాగంలో ద్రవ్యోల్బణం జులైలో 11.64ఉండగా అది ఆగస్టులో 11.06శాతానికి తగ్గింది. జులైలో 9.64శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 9.52శాతానికి తగ్గింది. కూరగాయల విభాగంలో మాత్రం 16.4 నుంచి 26.48శాతం పెరుగుదల నమోదు చేసింది.
జులైలో పారిశ్రామిక ఉత్పత్తుల వృద్ధి ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం మాత్రం ఇంకా పారిశ్రామిక రంగాలను భయపెడుతూనే ఉంది. అయితే ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వస్తే ఆర్థిక రంగానికి మరింత ఊపు వచ్చే అవకాశం లేకపోలేదు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications