
ఈ ఒప్పందం నవంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ-రవాణా రంగంలో వ్యాపారాన్ని విస్తరించేందుకు ఈ ఒప్పందం అవకాశం కల్పిస్తుందని తోషిబా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ తకేషి యోకోతా వెల్లడించారు. అంతేగాక వచ్చే ఐదేళ్లలో భారత్‌లో 20శాతం మార్కెట్ వాటాను సంపాదించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. 2015 వరకు విద్యుత్ పంపిణీ-రవాణా మార్కెట్ విస్తృస్థాయికి చేరి 4 బిలియన్ డాలర్ల వ్యాపారం చేయగలదని తెలిపారు. తోషిబా ఇందుకోసం ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేయనుంది. టీ అండ్ డీ సిస్టమ్స్‌కు సంబంధించిన తోషిబా అభివృద్ధి చేసిన అత్యాధునిక పరిజ్ఞానాన్ని కొత్త కంపెనీ అందుబాటులోకి తెస్తుంది.
విద్యుత్ పంపిణీ, ట్రాన్స్ ఫార్మర్లు తయారు చేసే ఉద్దేశంతో 1973లో విజయ్ ఎలక్ట్రికల్స్ ప్రారంభమైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జై రమేష్ ఈ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. విజయ్ ఎలక్ట్రికల్స్ విద్యుత్ ఉపకరణాల తయారీలో తక్కువ సమయంలోనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.
విజయ్ ఎలక్ట్రికల్స్ 2006లో విద్యుత్ రవాణా-పంపిణీ (టీ అండ్ డీ) వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ట్రాన్స్ మిషన్ ట్రాన్స్ ఫార్మర్లు, స్విచ్ గేర్ తయారీతోపాటు అల్ట్రా-హైవోల్టేజీ 1200 కేవీ పవర్ ట్రాన్స్ ఫార్మర్లను తయారు చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీలో 6వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వార్షిక టర్నోవర్ 250 మిలియన్ డాలర్లు (రూ.1625 కోట్లు) ఉంది. తోషిబాతో తమ సంస్థతను సొంతం చేసుకుంటున్న పరిణామంపై విజయ్ ఎలక్ట్రికల్స్ సీఎండీ దాసరి జై రమేష్ మాట్లాడుతూ..అంతర్జాతీయ సంస్థ అయిన తోషిబాతో తమ సంస్థ, ఉద్యోగులు భాగస్వాములు కావడం తనకు సంతోషం కలిగిస్తోందని అన్నారు.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications