అమ్మకాలు అనేవి అభివృద్ధి చెందుతున్నమార్కెట్లకు దీర్ఘకాలిక ఆర్థిక సంకోచానికి సూచన కాకపోవచ్చు. 2008లో సంభవించిన ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పటికీ మూలధన ప్రవాహానికి ప్రశాంతత లేకుండా పోయింది. అయినప్పటికీ అభివృద్ధి చెందుతున్నమార్కెట్లలో పెరుగుదల కొనసాగుతూనే ఉంది. అయితే ఇది ఆర్థిక సంక్షోభానికి సంకేతం కాకపోవచ్చు. కానీ ‘1990లో సంభవించిన ఆర్థిక సంక్షోభానికి చాలా మంది సమాధానం చెప్పలేకపోయారు' అని ర్యాన్ ఎవెంట్ ఎకనామిస్ట్ లో రాయడం జరిగింది.
1997లో ఎక్సేంజి రేటులో ఫ్లెక్సిబిలిటీ, తక్కువ విదేశీ రుణం యొక్క మిశ్రమం అభివృద్ధి చెందుతున్న మార్కెట్లను ఇంతకముందు జరిగిన ఆర్థిక సంక్షోభ స్థాయికి చేరేందుకు దోహదపడలేదు. ద్రవ్య విధానాలు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఔట్ పుట్ స్థిరీకరణకు, ద్రవ్య సంస్కరణలకు తోడ్పడతాయి.

సమాజ సంపదలు అంతర్జాతీయ వాణిజ్యానికి ఏ విధంగా తోడ్పడతాయనడానికి మూడు ప్రధాన విధానాలున్నాయి. అవి స్థిరమైన ఎక్సేంజి రేటు, దృఢమైన ద్రవ్య విధానం, ఓపెన్ క్యాపిటల్ ఎకౌంట్. స్థిరమైన ద్రవ్య వసతులు ఉన్నప్పుడు వాణిజ్యమనేది సులభమవుతుంది. దృఢమైన ద్రవ్య విధానం, ఓపెన్ క్యాపిటల్ ఎకౌంట్‌లు కేంద్ర బ్యాంకుచే సమన్వయం చేయడం ద్వారా దేశంలోనూ, అంతర్జాతీయంగానూ పెట్టుబడి అవకాశాలను పెంచుకునేందుకు వీలు ఉంటుంది.
అయితే ఒకేసారి రెండు విధానాలను మాత్రమే అమలు చేసేందుకు సాధ్యమవుతుంది. అలాంటప్పుడు మూడు విధానాలను అమలు చేయడం అసాధ్యమే అవుతుంది. ఒక దేశం తన దేశ కరెన్సీని స్థిరీకరించాలనుకుంటే మూలధన ప్రవాహాన్ని కూడా కొనసాగించాలి. అప్పుడు కేంద్ర బ్యాంకు ద్రవ్య విధానాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. నిరుద్యోగంతో వచ్చే సమస్యలను కేంద్ర బ్యాంకు తన వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా ద్రవ్య విధానాన్ని ప్రకటించేందుకు అవకాశం ఉంటుంది. కానీ కేంద్రబ్యాంకు ఎక్సేంజి రేటును స్థిరంగా ఉంచుతూ, వడ్డీ రేట్లను పెంచుకుంటూ దృఢమైన ద్రవ్య విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications