ఫ్యూచర్స్ మార్కెట్‌లో ట్రేడ్?: తెలుసుకోండి

స్టాక్ ఫ్యూచర్సులో వర్తకం ఏ వింగా చేయాలి?
క్యాష్ మార్కెట్‌లో ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఫ్యూచర్ మార్కెట్‌లోకి వెళ్లే ముందు ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు మీరు యెస్ బ్యాంక్‌కు సంబంధించిన 100 షేర్లను క్యాష్ మార్కెట్‌లో ఒక్కో షేరుకు రూ.280 పెట్టి కొంటే రూ.28,000 అవుతుంది. ఒక వేళ ఆ షేర్ల ధరలు పెరిగితే అప్పుడు అమ్మేయొచ్చు. పెరిగిన ధరల ప్రకారం 100 షేర్లకు ఒక్కో షేర్‌కు రూ. 300 ఉంటే ఆ షేర్లను రూ. 30వేలకు అమ్మి రూ. 2వేల లాభాన్ని పొందవచ్చు.
అదే ఫ్యూచర్ మార్కెట్ అయితే మీరు క్యాష్ మార్కెట్ లో పెట్టిన మొత్తం రూ. 28వేలకు ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. ఎందుకంటే మీరు ఫ్యూచర్స్ మార్కెట్‌లో మార్జిన్ 15శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఫ్యూచర్స్ మార్కెట్‌లో క్యాష్ మార్కెట్‌లో పెట్టిన రూ. 28వేలను పెట్టి యెస్ బ్యాంక్ సంబంధించిన 500 షేర్లను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. క్యాష్ మార్కెట్ తో పోల్చుకున్నట్లయితే మీరు పొందిన రూ. 2వేల కంటే ఎక్కువ అంటే రూ. 10వేలు లాభం పొందవచ్చు.
క్యాష్ మార్కెట్‌తో పోల్చుకున్నట్లయితే రిస్క్ ఎక్కువ ఉన్నప్పటికీ లాభం కూడా అంతకంటే రెట్టింపునకు మించి ఉన్నందున మీరు ఫ్యూచర్స్ ను ఎంచుకోవడమే మంచిది. మీరు 6 నుంచి 7సార్లు ఫ్యూచర్ మార్కెట్‌లో మార్జిన్ మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
ఫ్యూచర్స్ లో రకాలు
ఫ్యూచర్స్‌లో రెండు రకాలున్నాయి. అవి ఒకటి స్టాక్ ఫ్యూచర్స్ కాగా మరొకటి ఇండెక్స్ ఫ్యూచర్స్. స్టాక్ ఫ్యూచర్స్ గురించి చెప్పాలంటే పైన చెప్పిన యెస్ బ్యాంకు ఉదాహరణ సరిపోతుంది. ఇండెక్స్ ఫ్యూచర్స్ నిఫ్టీ ఫ్యూచర్ లాగే ఉంటుంది. ఎక్కడైతే మీరు షేర్లను కొనడం-అమ్మడం, లేదా అమ్మడం-కొనడం జరుగుతుందో అదే నిఫ్టీ లేదా ఇండెక్స్ ఫ్యూచర్స్.
రోజువారి ఒప్పందాలు
ఫ్యూచర్స్ ఒప్పందాలు రోజు ఆధారంగా నిర్ణయించబడతాయి. ఒక రోజు వ్యవహారాలు ముగిసే సరికి వచ్చిన లాభం లేదా నష్టాలు వెల్లడవుతాయి. ఒక వేళ నష్టాలు ఉన్నట్లయితే మార్కెట్స్ మార్జిన్ మనీ నుంచి చెల్లించి చూపిస్తాయి. లాభం ఉన్నట్లయితే మార్జిన్ మనీకి కలిపి చూపిస్తాయి.
ఒప్పందం ముగింపు
ఫ్యూచర్స్ కాంట్రాక్టలన్నీ ఒక స్థిరమైన తేదీ వరకు మాత్రమే ఉంటాయి. అదే మనదేశంలో అయితే ఫ్యూచర్స్, ఎంపిక అవకాశాలు నెలలో చివరి గురువారం ముగుస్తాయి. క్యాష్ మార్కెట్‌లో అయితే జీవిత కాలం వరకు మీ షేర్లను కొనసాగించవచ్చు. కానీ ఫ్యూచర్ మార్కెట్‌లో అత్యధికంగా మూడు నెలలు మాత్రమే కొసాగించొచ్చు. ఫ్యూచర్స్ మార్కెట్ ఎక్కువ రిస్క్ అనిపిస్తుంది ఎందుకంటే తక్కువ టైమ్‌లో ఎక్కువ లాభాలు వస్తాయి కానీ తక్కువ టైమ్‌లోనే ఆ మొత్తం కోసం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications