కఠిన నిర్ణయాలు తీసుకుంటాం: చిదంబరం

ఈ మేరకు ప్రభుత్వం త్వరలో కఠిన నిర్ణయాలను తీసుకోనుందన్నారు. దీంతో పాటుగా అనవసర ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఒత్తిళ్లతో ముందుకు సాగుతున్నామని వీటన్నిటి నుంచి బయటపడాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు. వచ్చే కొద్ది రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోనున్నది ప్రకటించనున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నామన్నారు.
ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించుకోవాలని, డీజిల్, పెట్రోలు ధరలను పెంచే విషయంలో తొందరపాటుతో ఏ నిర్ణయం తీసుకోబోమన్నారు. రూపాయి స్థితి కొద్ది రోజులుగా మెరుగైందని చెప్పారు. కరెన్సీ నిపుణుల్లో అంతుబట్టని అంశాలతో పోరాడుతున్నామని, విదేశీ నిధుల రాకను పెంచే చర్యలు తీసుకున్నామని, మరికొన్ని చర్యలు తీసుకుంటానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
బొగ్గు దిగుమతి, ముడి ఇనుము ఫైన్స్ ఎగుమతిపై నిషేధం సహా భారీ స్థాయిలో బంగారం దిగుమతి వంటి అంశాల వల్ల కరెంట్ ఖాతా లోటుపై భారీగా ఒత్తిడి పడుతోందని చిదంబరం తెలిపారు. ద్రవ్యోల్బణం సమస్యను సరఫరాల వైపు నుంచి పరిష్కరించుకోవాలని సూచించారు.


Click it and Unblock the Notifications