ఛార్జీలను పెంచేసిన ఎయిర్ ఇండియా

ప్రస్తుతం పెరిగిన ఇంధన ధరల కారణంగానే దేశీయ విమాన ప్రయాణ ఛార్జీలను 23 నుంచి 25శాతానికి పెంచుతున్నట్లు ఎయిర్ ఇండియా అధికారి ఒకరు చెప్పారు. రూపాయి మారకం విలువ తగ్గడం ఆందోళన కలిగిస్తోందని, అంతర్జాతీయ పరిణామాలు కూడా ధరల పెరుగుదలకు దోహదపడుతున్నాయని తెలిపారు.
భవిష్యత్‌లో అంతర్జాతీయ మార్గాల్లో కూడా ప్రయాణ ఛార్జీలను పెంచే అవకాశం ఉందని తెలిపారు. భారత దేశంలో ఎయిర్ ఇండియా సుమారు 82శాతం ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరవేస్తోందని తెలిపారు. పండగల సందర్భంగా ప్రయాణికులు ముందుగానే బుకింగ్ చేసుకోవాలన్నారు. జులైలో ఎయిర్ ఇండియా
19.2శాతం దేశీయ మార్కెట్ షేర్‌ను సాధించిందని తెలిపారు.
అయితే ఇప్పటికే స్పైస్ జెట్ విమానయాన సంస్థ 25శాతం ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందె. కాగా జెట్ ఎయిర్ వేస్ 25శాతం ప్రయాణ ఛార్జీలను బుధవారం పెంచింది. వివిధ అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి విలువ పతనం వంటి అంశాలు విమాన ఛార్జీలు పెంచేందుకు దోహదం చేస్తున్నాయని యాత్ర.కామ్ అధ్యక్షుడు శరత్ ధల్ తెలిపారు. బ్యాంకాక్, సింగపూర్, దుబాయి లాంటి దేశాలకంటే మన దేశంలో ఇంధన ధరలు 50నుంచి 60శాతం ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. పెరుగుతున్న ఇంధన ధరలు, బలహీనపడుతున్న భారత ఆర్థిక వ్యవస్థ దేశీయ విమానయాన సంస్థలపై తీవ్ర ప్రభావం చూప్తిస్తున్నట్లు స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications