లోక్ సభ: పెన్షన్ బిల్లుకు ఆమోదం

పెన్షన్ నిధి నిల్వలను స్టాక్ మార్కెట్‌లో ఫండ్ మేనేజర్లద్వారా పెట్టుబడి పెట్టడాన్ని ఇతర పార్టీల ఎంపీలు వ్యతిరేకించారు. కాగా, చందాదారులకు కనీస ఆదాయంపై హామీ ఇచ్చేలా 'పింఛన్ నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్‌డీఏ) బిల్లు-2011' రూపొందించినట్లు ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. బిల్లుపై చర్చ అనంతరం పార్లమెంట్ సభ్యుల సందేహాలకు ఆయన సమాధానమిచ్చారు.
స్థాయి సంఘం సూచించిన మెజార్టీ సిఫారసులను ప్రభుత్వం ఆమోదించినట్లు ఆయన తెలిపారు. బిల్లుకు ఆమోదం లభించడంతో పీఎఫ్ఆర్‌డీఏ చట్టబద్ధత పొందుతుందని చిందబరం చెప్పారు.
పెన్షన్ బిల్లు ఆమోదంతో పెన్షన్ రంగం నియంత్రణ కోసం 2003లో ఏర్పాటు చేసిన పీఎఫ్ఆర్‌డీఏకు పూర్తి చట్టబద్ధ అధికారాలు లభిస్తాయి. బీమాతో ముడిపడినవి కాకుండా పింఛన్ ఆధారిత ఉత్పత్తుల మార్కెట్ ప్రవేశానికి అవకాశం ఉంటుంది. పెన్షన్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పరిమితిని మంత్రిమండలి 26 శాతంగా నిర్ణయించింది.
2005లోనే బిల్లును లోక్‌సభలో ప్రవేశపట్టడం జరిగింది. మళ్లీ 2011లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ బిల్లును లోక్‌సభలో పునఃప్రవేశపెట్టారు. సైనిక బలగాలు మినహా ఇతర ప్రభుత్వ సర్వీసులలో 2004 జనవరి 1 తర్వాత చేరే ఉద్యోగులందరికీ 'జాతీయ పింఛన్ వ్యవస్థ' (ఎన్‌పీఎస్)ను తప్పనిసరి చేశారు.కాగా 2009లో దీన్ని స్వచ్ఛంద ప్రవేశ ప్రాతిపదికన పౌరులందరికీ వర్తింపజేశారు.
పెన్షన్ నిధిద్వారా నిధుల ప్రవాహాన్ని దేశం కోసం దీర్ఘకాలిక ఆస్తుల సేకరణకు మళ్లించేందుకు పెన్షన్ నిధి దోహదపడుతుంది. అంతేగాకుండా బీమా, పెన్షన్ రంగాలు మౌలిక సదుపాయాల కల్పనలోనూ పెట్టుబడులు పెట్టేలా పెన్షన్ బిల్లు ప్రోత్సహిస్తుంది.
బిల్లుతో పెన్షనర్లకు నష్టమే: యూటీఎఫ్
హైదరాబాద్: పెన్షన్ బిల్లుకు పార్లమెంట్‌లో ఆమో దం లభించడాన్ని యూటీఎఫ్ తీవ్రంగా ఖండించింది. బిల్లు ఆమోదంతో పెన్షనర్లకు ఎలాంటి లాభం చేకూరదని, ఈ చట్టం పెన్షనర్లకు గొడ్డలిపెట్టని ధ్వజమెత్తింది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీవితాలలో ఇదో చీకటి దినమని పేర్కొంది.
పెన్షన్ బిల్లును చట్టం చేయవద్దని 8 ఏళ్లుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు పోరాడుతున్నపటికీ ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావడం దారుణమని యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.నర్సిరెడ్డి, ఐ.వెంకటేశ్వరరావులు ఆరోపించారు. బిల్లుతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రం గా నష్టపోతారని, పెన్షన్ వర్తించే వారికి గ్రాట్యు టీ చెల్లింపు జరిగే అవకాశం ఉండకపోవచ్చన్నారు.


Click it and Unblock the Notifications