హైదరాబాద్: హోమియోపతి, ఆయుర్వేద వైద్య రంగంలో విశేష సేవలందించిన స్టార్ హోమియోపతి & స్టార్ ఆయుర్వేద సికింద్రాబాద్ సరోజినీదేవీ రోడ్‌లోని హోటల్ మినర్వా పక్కన ఉన్న భువన టవర్స్ లో మరో ఇంటిగ్రేటెడ్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా గురువారం మాదాపూర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టార్ ఆయుర్వేద హోమియోపతి ఇంటిగ్రేటెడ్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ లోగోను కందిరీగ మూవీ ఫేమ్, సినీ నటి అక్ష విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో స్టార్ హోమియోపతి & స్టార్ ఆయుర్వేద సీఎండీ మురళీ అంకిరెడ్డి, డైరెక్టర్లు డాక్టర్ శ్రీనివాస్ గుప్తా, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టార్ హోమియోపతి, ఆయుర్వేద బ్రాంచ్‌ను ఈ నెల 8న ఆదివారం ఉదయం 11.30గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు చెప్పారు.

భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఐదువేల సంవత్సరాల పురాతన వైద్య సముదాయం ఆయుర్వేదం, మూడు శతాబ్దాల క్రితం జర్మనీలో ఆవిర్భవించిన హోమియో వైద్యం రెండూ ఒకే ప్రాంగణంలో ఉన్నాయన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, సూపర్ స్పెషాలిటీ సేవలను అడ్వాన్స్‌డ్ ఆయుర్వేద, అడ్వాన్స్‌డ్ హోమియోపతి మందుల ద్వారా దీర్ఘకాలిక, మొండి వ్యాధులకు చికిత్స చేస్తారని వెల్లడించారు. కీళ్లనొప్పులు, థైరాయిడ్, అస్థమా, కాలేయ, జీర్ణసంబంధ సమస్యలకు, ఆపరేషన్ లేకుండా టాన్సిల్స్, ఆడినాయిడ్స్, కిడ్నీలో రాళ్లు, గాయిటర్, పైల్స్, ఫిషర్, ఫిస్టులాకు 35 సంవత్సరాల అనుభవం, పరిశోధన, నిపుణత కలిగిన స్టార్ వైద్యబృందం చికిత్స చేస్తారని తెలిపారు.
అడ్వాన్స్‌డ్ జర్మనీ, స్విస్ హోమియోపతి మందులు, కేరళ, హిమాలయాలలో తయారైన మందులతోపాటు కేరళ, పంచకర్మ చికిత్స ద్వారా వ్యాధి మూల కారణాన్ని తొలగిస్తారని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని కొత్తపేట, కూకట్ పల్లి, సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కర్నాటకలోని బెంగళూరు, జయానగర్, హుబ్లీ, మంగుళూరులలో స్టార్ హోమియోపతి & స్టార్ ఆయుర్వేద బ్రాంచ్ లు ఉన్నాయన్నారు. ఈ బ్రాంచ్ ప్రారంభ సందర్భంగా స్టార్ బ్రాంచ్ లలో వారం రోజులపాటు ఉచిత కన్సల్టేషన్, మందులపై 30శాతం వరకు అన్ని బ్రాంచ్‌లలో కల్పిస్తున్నట్లు తెలిపారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications