
రూపాయి విలువ కూడా భారీగా పతనమైంది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.68కి చేరుకుంది. అది మరింత తగ్గి బుధవారం రూ.68.55గా నమోదైంది. సిరియా ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపైనా ప్రభావితం చూపిస్తోంది.
అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు భారత వృద్ధిరేటు అంచనాలు కుదిస్తూ ఉండటం, బలహీనంగా ఉన్న పారిశ్రామికోత్పత్తి వంటి పరిణామాలు, సిరియాపై సైనిక చర్య మొదలగు వార్తలు మార్కెట్లను వణికిస్తున్నాయి. ఒక వేళ అమెరికా సిరియాపై సైనిక చర్యకు దిగితే క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. అదే జరిగితే భారత ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే అమెరికా మధ్యధరా సముద్రంలోని కేంద్ర ప్రాంతం నుంచి రెండు క్షిపణులు పాశ్చాత్య దేశాలపై ప్రయోగించడం జరిగిందంటూ రష్యన్ మీడియాలో వార్తలు వచ్చాయి. సిరియాపై అమెరికా సైనిక చర్యకు అవకాశముందంటున్న తరుణంలో ఈ వార్తలు మార్కెట్ వర్గాలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.
మంగళవారం ఉదయం 19000కు పైగా పాయింట్లతో ప్రారంభమైన సెన్సెక్స్ 651.47 పాయింట్ల నష్టంతో 18234.66 వద్ద ముగిసింది. అమ్మకాల ఒత్తిడి భారీగా సాగడంతో బిఎస్ఇలో 170 స్టాక్‌లు ఏడాది కనిష్ఠ స్థాయిలకు దిగజారాయి. ఒక్క రోజులోనే ఇన్వెస్టర్లు రూ.1.62 లక్షల కోట్ల సంపదను పోగొట్టుకున్నారు.
మన దేశ ఆర్థిక పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతోంది. ఈ ఏడాది వృద్ధి రేటు 4 శాతం మాత్రమేఉండొచ్చంటూ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు జెపి మోర్గాన్, హెచ్ఎస్‌బిసి గ్లోబల్ రీసెర్చ్, నోమురా, గోల్డ్‌మాన్ శాచ్ భారత రేటింగ్‌ను వరుసగా కుదించడంతో మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచింది.


Click it and Unblock the Notifications