ముంబై: వచ్చే పండగ సీజన్లలో విమానాల్లో ప్రయాణించే ప్రజలకు కొంతమేర ఇబ్బందులు కలగక తప్పదు. ఎందుకంటారా దేశ విమానాయన సంస్థలు ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్ వేస్ విమాన ఛార్జీలను త్వరలోనే పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం.
మరో విమానయాన సంస్థ స్పైస్ జెట్ ఇప్పటికే తన విమాన ఛార్జీలను కొంతమేర పెంచింది. తక్కువ ఖర్చుతో ఇంతవరకు సేవలందించిన స్పైస్ జెట్ మంగళవారం నుంచి టికెట్ ధరపై 25శాతం పెంచేసింది. పెరిగిన ధరల ప్రకారం ముంబై నుంచి ఢిల్లీకి 6వేల నుంచి రూ. 7వేలకు పెరిగింది. స్పాట్ బుకింగ్ ఫేర్ రూ.10వేలు.

విమాన ఇంధన ధరలు పెరగడం వల్లే టికెట్ ధరలు పెంచడం జరిగిందని సంస్థకు చెందిన ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ధరలు పెంచక తప్పడం లేదని అన్నారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ యజమాని విజయ్ మాల్యా ఎవరినీ వదిలిపెట్టకుండా ఇంజన్ సరఫరాదారులను, ఉద్యోగులను, బ్యాంకులను, టాక్స్ అథారిటీలను విమర్శించారు. ఈ స్థితిలో స్పైస్ జెట్ కూడా కింగ్ ఫిషర్ పరిస్థితిని ఎదుర్కోబోతుందా అనే సందేహం కలుగుతోంది.
వైమానిక ఇంధనం ధర ప్రస్తుతం కన్నా 7శాతం పెరిగిందని తెలిపారు. జులై నుంచి సెప్టెంబర్ మధ్యలో వరుసగా22శాతం ఇంధనం ధరలు పెరిగాయని చెప్పారు. ఎయిర్ లైన్స్ ధరలు పెంచడం తప్ప మరో అవకాశం లేదని విమానయాన మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. చాలా కాలం తర్వాత విమానయాన సంస్థలు పుంజుకుంటున్న తరుణంలో ఇంధన ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ETFs.. కొనుగోలుపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

Bengaluru: లేఆఫ్స్ ఉచ్చులో ఐటీ నిపుణులు! ఒకేరోజు 40 శాతం సిబ్బంది తొలగింపు.. అసలేం జరుగుతోంది?

Bengaluru: హైదరాబాద్ దూసుకొస్తున్నా.. బెంగళూరు క్రేజ్ తగ్గట్లేదు ఎందుకు?



Click it and Unblock the Notifications