
మరోవైపు స్టాక్ మార్కెట్లు కూడా భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 600 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 200 పాయింట్ల నష్టాన్ని చవి చూసింది. రూపాయి పతనంతో బంగారం ధర కూడా పెరిగింది. 10గ్రాముల బంగారం ధర రూ. 33,321, కిలో వెండి ధర రూ.57,379లకు చేరుకుంది.
ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్సేంజి, అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతులు కూడా రూపాయి పతనానికి కారణమవుతున్నట్లు తెలుస్తోంది. ఫొరెక్స్ వర్గాల ప్రకారం యెన్, యూరోలకు వ్యతిరేకంగా డారల్ పెరుగుదల, పెరుగుతున్న అమెరికా కరెన్సీ దిగుమవుతులు కూడా రూపాయి పతనానికి కారణమవుతుందని తెలుస్తోంది. దేశీయ ఈక్విటీలు కూడా రూపాయి పతనాన్ని పెరుగుదలకు పరిమితం చేస్తున్నాయి.
ఐరోపా, అమెరికా, ఇతర ఆసియా దేశాల్లో ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. ఐరోపా దేశాల్లో పరిశ్రమల పరిస్థితి మెరుగుపడుతోంది. చైనా పరిశ్రమల ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది. అమెరికాలో అయితే ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని భావించి ఉద్దీపన పథకాలను నిలిపివేశారు.
కానీ భారత్ లో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. గత దశాబ్దకాల కనిష్టస్థాయి 5శాతానికి జీడీపీ పడిపోయింది. ఈ ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు గురికాక తప్పదని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications