
1991 నాటి సంస్కరణలను రతన్ టాటా ప్రస్తావిస్తూ ఇప్పుడున్న బృందమే అప్పట్లో చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని దేశాన్ని ముందుకు నడిపించిందని టాటా అన్నారు. కానీ ప్రస్తుతం కొంత మంది తమ స్వార్ద ప్రయోజనాల కోసం పని చేస్తున్నారన్నారు. అలాంటి అడ్డగోలు శక్తులకు తలొగ్గకుండా దేశ ప్రయోజనాలు కాపాడే విధంగా పరిస్దితులు మెరుగుపరచాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని మన్మోహన్ సింగ్ సారథ్యంపై తనకు అపార గౌరవం ఉందని, రాబోయే కాలంలో కూడా గౌరవం ఉంటుందని రతన్ టాటా చెప్పారు. మనం ఎలాంటి నాయకత్వం కావాలని కోరుకుంటున్నామో.. దేశాన్ని ముందుండి నడిపించాలనుకుంటున్నామో.. అలాంటి నాయకత్వం లేదని రతన్ టాటా వ్యాఖ్యానించారు.
ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా ఆలస్యంగా గుర్తించిందన్నారు. ప్రైవేట్ రంగంలోని కొంతమంది స్వార్థపరులకు ప్రభుత్వం లొంగిపోతోందని తెలిపిన రతన్ టాటా .. విధానాలను మార్చేయడం, జాప్యాలు చేయడం లాంటివి చోటుచేసుకుంటున్నాయని అన్నారు. ఐతే మన దేశ ప్రధాని మన్మోహన్ సింగ్.. దేశం గర్వంగా తలెత్తుకునేలా చేశారని, కానీ ఇటీవలి కాలంలో ఆ ప్రతిష్ట మసకబారుతోందని ఆయన చెప్పారు. పెట్టుబడిదారులకు భారత్‌పై విశ్వాసం సన్నగిల్లుతున్నా.. ప్రధాని మౌనం వహిస్తున్నారన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మనం ప్రపంచం నమ్మకాన్ని కోల్పోయాం. మన ప్రభుత్వం ఆ విషయాన్ని చాలా ఆలస్యంగా గుర్తించిందని రతన్ టాటా పేర్కొన్నారు.
ఇక ప్రస్తుతం రతన్ టాటా ఎయిర్ ఏషియా ఇండియా డైరెక్టర్ల బోర్డుకు చీఫ్ ఎడ్వైజర్‌గా వ్యవహారిస్తున్నారు. తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసిన టోనీ ఫెర్నాండెజ్ రతన్ టాటాకి ఉన్న అపారమైన అనుభవం, మా సంస్దకు ఎంతో ఉపయోగపడుతుందని.. ఆయనను సాదరంగా ఎయిర్ ఏషియా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు.
వన్ఇండియా మనీ తెలుగు


Click it and Unblock the Notifications