ముంబై: గురువారం స్వల్ప లాభాలతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఐటీ, మెటల్, ఫార్మా రంగాలకు చెందిన కంపెనీల షేర్లు మద్దతుగా నిలవడంతో స్టాక్ మార్కెట్లు ప్రధాన సూచీ సెన్సెక్స్ లాభాల్లో ముగిసింది. ఉదయం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి పతనం ఎన్నడూ లేని విధంగా చారిత్రాత్మక కనిష్టానికి చేరుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం (68.70) కనిష్టానికి చేరుకుంది. దీంతో ఆరంభంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ 10.25 గంటల ప్రాంతంలో 400 పాయింట్ల వరకూ నష్టపోతూ 17,539.28 వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత కనిష్ట స్దాయిలో ఎఫ్‌ఐఐ, ఎల్ఐసీ కొనుగోళ్లు జరపడంతో కోలుకుంది. చివరకు సెన్సెక్స్ 28 పాయింట్లు లాభపడి 17,996 వద్ద ముగియగా.. నిఫ్టీ 2 పాయింట్లు కోల్పోయి 5,285 వద్ద ముగిసింది.
నిన్న రెండు రూపాయల దాకా పతనం కాగా ఈరోజు రూపాయి 68.52వద్ద ట్రేడ్ అయింది. ఈ వారంలో గనుక చూసినట్లైతే రూపాయి పతనం 6 శాతం వరకూ వెళ్లింది. జులైలో 15 నుండి 11 శాతం జనవరిలో 1 నుండి 18 శాతానికి తగ్గింది. ఇదిలా ఉండగా, బుధవారం నాటి మార్కెట్ లో డాలర్ ను పోల్చితే రూపాయి 256 పైసలు క్షీణించి 68.80ల చారిత్రాత్మక కనిష్టం వద్ద ముగిసింది. ప్రధాన సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో బీపీసీఎల్ 8 శాతం, ఓఎన్ జీసీ 6 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్, పీఎన్ బీ, హెచ్ డీ ఎఫ్ సీ కంపెనీలు 5 శాతానికి పైగా నష్టపోయాయి. రాన్ బాక్సీ అత్యధికంగా 10 శాతం, కెయిర్న్ ఇండియా, జయప్రకాశ్ అసోసియేట్స్, టీసీఎస్, జిందాల్ స్టీల్ కంపెనీలు లాభాల్ని నమోదు చేసుకున్నాయి.
రూపాయి పతనం ప్రభావం ఒక్క ఇండియన్ స్టాక్ మార్కెట్లపైనే కాకుండా ఇతర స్టాక్ మార్కెట్లపై కూడా పడింది. ఇది ఇలా ఉంటే మొన్నటి వరకూ తక్కువగా ఉన్న బంగారం, వెండి రూపాయి పతనం కావడంతో ఒక్కసారిగా పెరిగిపోయాయి.
Share This Article
English summary
లాభాల్లో సెన్సెక్స్.. చారిత్రాత్మక కనిష్టానికి చేరిన రూపాయి 68.70 | Rupee sinks further, breaches 68; sensex down over 400 points
The rupee breached the 67 and then the 68 mark against the dollar with considerable ease sending a shiver down the spine of stock markets. The rupee was last trading at 68.52 paise, down 228 paise over Wednesday's close.
Story first published: Wednesday, August 28, 2013, 18:26 [IST]