మళ్లీ రూపాయి పతనం.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది. నిన్న (సోమవారం) 104 పైసలు వరకూ కోల్పోయిన రూపాయి ఈరోజు (మంగళవారం) 110 పైసలు దాకా నష్టపోతుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మళ్లీ రూ. 65కు దిగిపోతుంది. ప్రస్తుతం 65 రూపాయిల 41 పైసల సమీపంలో ట్రేడవుతోంది. ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకుంటున్న చర్యలు రూపాయి పతనంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేక పోతున్నాయి.

ఇది ఇలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి పతనంతో స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ 487 పాయింట్ల దాకా నష్టపోతూ 18,070కి సమీపంలో ట్రేడ్ అవుతుంది. అదే విధంగా నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (నిప్టీ) 161 పాయింట్ల దాకా నష్టపోతూ 5,315కి సమీపంలో ట్రేడ్ అవుతుంది. రూపాయి మారకపు విలువ పడిపోతుండటంతో వచ్చే వారంలో పెట్రోల్, డీజిల్ 2 నుండి 3 రూపాయల వరకూ పెరిగే అవకాశం ఉందని సమాచారం. దీనితోపాటు విదేశాల నుండి దిగుమతి చేసుకునే అన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి.

రూపాయి పతనానికి ప్రధాన కారణాల్లో ఒకటి పెరిగిపోతున్న కరెంట్ అకౌంట్ లోటు. గత ఆర్థిక సంవత్సరంలో 8,780 కోట్ల డాలర్లుగా ఉన్న కరెంట్ అకౌంట్ లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7,500 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. కరెంట్ అకౌంట్ లోటు గత రెండు ఆర్థిక సంవత్సరాల కంటే తగ్గొచ్చని ఫిచ్ ఏషియా-పసిఫిక్ సావరిన్స్ హెడ్ అండ్రూ కోల్‌హన్ చెప్పారు. ఐతే రూపాయి పతనాన్ని అడ్డుకునే చర్యల్లో భాగంగా భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు ప్రస్తుతమున్న 27,800 కోట్ల డాలర్ల నుంచి 23,000 కోట్ల డాలర్లకు తగ్గే అవకాశాలున్నాయని అంటున్నారు.

వన్ఇండియా మనీ తెలుగు

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+