రూపాయి పతనం: మనపై ప్రభావం ఏవిధంగా (ఫోటోలు)
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ రోజురోజుకీ పతనమవుతుంది. రూపాయి క్షీణత ద్రవ్య రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో రుణాలపై వడ్డీ భారం పెరిగి రుణ గ్రహీతలు ఒత్తడికి లోనవడంతో పాటు మొండి బకాయిలు పెరుగుతాయి. ఇది ఇలాగే కొనసాగితే రేటింగ్ ఏజెన్సీలు భారత్ రేటింగ్‌ను తగ్గించే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి పతనం అవ్వడం వల్ల సామాన్య మానవునిపై దీని ప్రభావం ఎలాగ ఉండబోతుందో ఒక్కసారి చూద్దాం.
వినియోగదారుల భుజాలపై అదనపు భారం పడుతుంది. మార్కెట్లో కొనుగోలు చేసే సరుకుల ధర పెరగవచ్చు. దీంతో వినియోగదారులు గతంలోలాగా డబ్బును స్వేచ్చగా ఖర్చు పెట్టలేక అత్వవసరమైన వస్తువుల మాత్రమే కొనుగోలు చేయడం మొదలు పెడతారు.

కార్ల కంపెనీలు
పలు రకాలైన కార్ల కంపెనీలు చాలా వరకు విడిభాగాలను దిగుమితి చేసుకుంటున్నాయి. విలాసవంతమైన కార్ల కంపెనీలైతే విదేశాల్లో పూర్తిగా తయారైన కార్లనే ఇక్కడకి తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడం ఈ కంపెనీలను ఇబ్బందికి గురి చేస్తుంది. విదేశాల నుండి దిగుమతి చేసుకునేటప్పడు అధిక మొత్తం చెల్లించాల్సి వస్తుందో... అంతే మొత్తాన్ని వెంటనే వినియోగదారుల నుండి తిరిగి రాబట్టుకునే అవకాశం లేదు.

మొబైల్ ఫోన్లు
మన దేశంలో దాదాపు 9 0 కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. మొబైల్ ఫోన్లన్నీ చాలా వరకు దిగుమతి చేసుకుంటున్నవే. కొన్ని మొబైల్ కంపెనీలు విడి భాగాలను దిగుమతి చేసుకోని ఇక్కడ అసెంబుల్ చేసి విక్రయిస్తున్నాయి. రూపాయి మారకపు విలువ తగ్గడం వల్ల ఖరీదైన ఫోన్ల ధరలు పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

విదేశాల్లో చదువుకునే విద్యార్దులు
మన దేశం నుండి చాలా మంది విద్యార్దులు అమెరికా, ఆస్టేలియా, జర్మనీ, సింగపూర్ తదితర దేశాలకు చదువులకు వెళ్తున్నారు. ఇక ఎంబీబీఎస్ కోసం చైనా, కిర్గిజిస్దాన్, ఉక్రెయిన్, రష్యా వెళ్లే వారి సంఖ్య ఇటీవల కాలంలో ఎంతగానో పెరిగింది. విద్యార్దులు వారి చదువులకు అవరసరమైన ఫీజును అమెరికన్ డాలర్లలో చెల్లించాలి. రవాణా ఖర్చులు, ప్రయాణ భత్యానికి కూడా డాలర్లనే వాడుతుంటారు. ప్రస్తుత పరిస్దితుల్లో డాలర్‌కు దాదాపు రూ. 65 వరకూ చెల్లించి కోనుగోలు చేయాలంటే విద్యార్దులు తల్లితండ్రులు ఆలోచిస్తున్నారు.

విదేశీ రుణం
చౌకగా లభిస్తుందంటూ రెండు సంవత్సరాల క్రితం మన దేశానికి చెందిన పలు ప్రైవేటు రంగ కార్పోరేట్ సంస్దలు పెద్ద మొత్తంలో డాలరు రుణాలు తీసుకున్నాయి. గతంలో రూపాయి మారకపు విలువ 45 నుండి46 ఉండటంతో పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. ఐతే ఇప్పుడు డాలర్ విలువ ఒక్కసారిగా 65 రూపాయలకు చేరడంతో తీసుకున్న అప్పులు ఎలా తీర్చాలనే అలోచనలో పడ్డాయి.

పెట్రోలు, డీజిల్
చమురు దిగుమతిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ఒకటి. రూపాయి మారకపు విలువ పతనమవుతుండటంతో దేశాన్ని గడ్డు పరిస్దితుల్లోకి నెడుతుంది. చమురు ధర పెరగడంతో ఆ భారం వినియోగదారులపై పడుతుంది. రూపాయి విలువ ఇంకా పడిపోవడంతో పెట్రోలు, డీజిల్ ధరలను ప్రభుత్వం పెంచే ఆలోచనలో ఉంది. ప్రభుత్వ రంగంలోని చమురు మార్కెటింగ్ సంస్దలు ఒక పరిమితికి మంచి భారాన్ని యోయలేక... పెట్రోలు, డీజిల్ ధర పెంపునకు సూచనలిస్తున్నాయి. పెట్రోలు, డీజిల్ ధర పెరిగినట్లైతే అన్ని రకాల వస్తువులపై ధరలు ఆటోమాటిక్‌గా పెరుగుతాయి.

విదేశీ పర్యటనలు
విదేశీ పర్యటనల నిమిత్తం మన దేశం నుండి ఐరోపా, ఆసియా, అమెరికాలకు వెళ్లే వారు ఎక్కవగా ఉంటారు. రూపాయి మారకపు విలువ పతనమవడంతో విదేశీ పర్యటనకు వెళ్లినవారు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీంతో విదేశీ పర్యటనకు వెళ్లే వారి సంఖ్య ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టిందని టూర్ ఆపరేటింగ్ సంస్ది నిర్వాహకులు తెలిపారు.


Click it and Unblock the Notifications